Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎంటర్టైన్మెంట్ వార్తలు

ప్రభాస్‌తో పుకార్లకు చెక్.. దుబాయ్ వ్యక్తిని పెళ్లాడబోతున్న అనుష్క?

  • ప్రభాస్‌-అనుష్కపై గతంలో రూమర్లు
  • ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు
  • తామిద్దరం మంచి స్నేహితులమేనన్న అనుష్క, ప్రభాస్
  • ఆ తర్వాత రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌‌తోనూ సంబంధం ఉన్నట్టు వార్తలు
  • తాజాగా, దుబాయ్ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అవుతోందని రూమర్లు

టాలీవుడ్ నటి అనుష్క షెట్టి పెళ్లిపై వచ్చినన్ని రూమర్లు మరే నటి విషయంలోనూ వచ్చి ఉండవేమో! ప్రభాస్‌తో డేటింగ్‌లో ఉందని, త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కుప్పలుతెప్పలుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ వారిద్దరిలో ఎవరూ ఎప్పుడూ దీనిపై బహిరంగంగా స్పందించలేదు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వారు ఎన్నిసార్లు నెత్తీనోరు బాదుకుని చెప్పినా పుకార్ల ప్రవాహం మాత్రం ఆగలేదు. 

తాజాగా, మరోమారు ఆమె పెళ్లిపై వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, ఈసారి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి గురించే ఈ వార్తలన్నీ. దుబాయ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త అనుష్క మెడలో త్వరలోనే తాళి కట్టబోతున్నాడని ఇంటర్నెట్ హోరెత్తిస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమేనని చెబుతున్నారు. ‘వన్ ఇండియా’ కథనం ప్రకారం.. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను అనుష్క త్వరలోనే పెళ్లాడబోతున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు ఇప్పటికే పెళ్లిపై మాట్లాడుకున్నారు. అయితే, షరా మమూలుగానే అనుష్క కానీ, ఆమె సిబ్బంది కానీ ఈ వార్తలపైనా స్పందించలేదు. అయినప్పటికీ ఈ వార్త మాత్రం వైరల్ అయింది. కాగా, అనుష్కకు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌కు మధ్య సంబంధం ఉందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను కూడా అనుష్క ఖండించింది.

Related posts

విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు.. కారణం ఇదే!

Ram Narayana

2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ – 2024.. అవార్డుల పోటీలో తెలుగు చిత్రాలు ఇవే!

Ram Narayana

గాయని మంగ్లీకి విశిష్ట పురస్కారం

Ram Narayana

Leave a Comment