Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీటీడీకి 1000 ఆవులిస్తా.. సొంతంగా నెయ్యి తయారుచేసుకోవచ్చు: బీసీవై పార్టీ అధక్షుడు బోడే

  • చంద్రబాబుకు లేఖ రాసిన రామచంద్రయాదవ్
  • టీటీడీకి సొంతంగా డెయిరీ ఫాం ఎందుకు ఉండకూడదని ప్రశ్న
  • మరో లక్ష గోవుల్ని ఉచితంగా తరలించే బాధ్యత తీసుకుంటానని హామీ
  • టీటీడీ పాలకమండలిలో ఆధ్యాత్మిక గురువులకు చోటివ్వాలని విన్నపం

తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం కొనసాగుతున్న వేళ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ కీలక ప్రకటన చేశారు. టీటీడీకి తాను వెయ్యి గోవుల్ని ఇస్తానని, వాటితో డెయిరీఫాం పెట్టి నెయ్యి తయారుచేసి ఆ నెయ్యినే లడ్డూ ప్రసాదాలకు ఉపయోగించవచ్చంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి లేఖ రాశారు.

టీటీడీకి సొంత డెయిరీ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వం కనుక డెయిరీ ఏర్పాటుకు రెడీగా ఉంటే తాను వెయ్యి ఆవుల్ని ఇస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, మరో లక్ష గోవుల్ని ఉచితంగా తిరుమలకు తరలించే బాధ్యతను కూడా తాను తీసుకుంటానని చెప్పారు. లక్ష ఆవుల నుంచి రోజుకు పది లక్ష లీటర్ల పాలు ఉత్పత్తి అయినా దాదాపు 50 వేల కేజీల వెన్న వస్తుందని, దాని నుంచి సుమారు 30 వేల కేజీల నెయ్యి ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. ఆ నెయ్యిని స్వామివారి ధూప, దీప నైవేద్యాలు, లడ్డూ తయారీ కోసం ఉపయోగించవచ్చని, మిగతా నెయ్యిని ఇతర ఆలయాలకు కూడా సరఫరా చేయవచ్చని తెలిపారు. ఇలా చేస్తే నెయ్యి కల్తీ జరగకుండా ఉంటుందని అభిప్రాయడ్డారు. అలాగే, టీటీడీ పాలకమండలిలో ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులకు చోటు కల్పించాలని కోరారు.

Related posts

మైసూరు-చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆరంభం.. 

Drukpadam

వామ్మోఇంజనీరింగ్ ఫీజులు …. ఆందోళ‌న‌లో విద్యార్థుల త‌ల్లిదండ్రులు!

Drukpadam

భట్టి ,తుమ్మల ,పొంగులేటి ,నామ ,వద్దిరాజు ల నూతన సంవత్సర శుభాకాంక్షలు …

Ram Narayana

Leave a Comment