నాగన్న పురస్కార అవార్డు పోస్టర్ ఆవిష్కారం
ఆవిష్కరించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె శ్రీనివాస్
ఖమ్మం నగరపాలక మున్సిపల్ మేయర్ నీరజ
ఖమ్మం, అక్టోబర్ 7: సుద్దాల హనుమంతు – జానకమ్మల జాతీయ పురస్కారానికి అరుణోదయ నాగన్న ఎంపికయ్యారు. ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య కళా నిలయంలో అవార్డును అందజేయనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక టీఎన్జీవో కార్యాలయంలో ఖమ్మం నగరపాలక మున్సిపల్ మేయర్ పూనకొల్లు నీరజ, టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావులు ఆదివారం సాయంత్రం నాగన్న పురస్కార అవార్డు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, టీజీవోస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
నాగన్న పోస్టర్ ను ఆవిష్కరించిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్
సుద్దాల హనుమంతు జానకమ్మల జాతీయ పురస్కార అవార్డు అందుకోనున్న అరుణోదయ నాగన్న పోస్టర్ ను ఆదివారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ ఆవిష్కరించారు. కథ సంకలనం పుస్తక ఆవిష్కరణ సభలో శ్రీనివాస్ తో కలిసి ప్రముఖ కవులు శివారెడ్డి, మువ్వా శ్రీనివాసరావు, వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్, జ్యోతి తదితరులు నాగన్న పోస్టర్ను ఆవిష్కరించారు.