రాజకీయపండితుల లెక్కలు తప్పాయి …ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు …
హర్యానా నిరాశతో కొంగుతిన్న కాంగ్రెస్…జమ్మూ కాశ్మిర్ లో మళ్ళీ ఎగిరిన ఎన్సీ జెండా
ఉదయం కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో సంబురాలు …12 గంటల తర్వాత బీజేపీ కార్యాలయంలో
హర్యానాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ
సీఎం షైనీకి పీఎం మోడీ ఫోన్
హర్యానా , జమ్మూ కాశ్మిర్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి…అయితే రాజకీయ పండితులు అనుకున్నట్లు లెక్కలు తప్పాయి…ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి…హర్యానాలో కాంగ్రెస్ అఖండ మెజార్టీ సాదిస్తుందని , జమ్మూ కాశ్మిర్ లో మిశ్రమ ఫలితాలు ఉంటాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. దీంతో కాంగ్రెస్ హర్యానా ఈసారి తప్పుకున్న తమ ఖాతాలో పడుతుందని విశ్వాసంగా ఉంది … ఎవరిని సీఎం చేయాలనే దానిపైనా తర్జన భర్జనలు జరిగాయి…పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కాంగ్రెస్ భారీ మెజార్టీ సాదిస్తుందని సంకేతాలు వచ్చాయి…దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ హెడ్ క్వార్టర్ లో సంబరాలు చేసుకున్నారు …పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఈవీఎం ల లెక్కింపులో కాంగ్రెస్ కు వెనక్కు నెట్టి బీజేపీ అనూహ్య రీతిలో పుంజుకుంది ..అంటే కాదు గతంలో కంటే ఓట్లు సీట్లు పెరిగాయి…తాము గెలుస్తామన్న రాష్ట్రంలో ఓటిమి దిశగా పయనించడంతో ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ విరుచుపడింది …ఎక్కడో లోపం జరిగిందని జిల్లాల అధికార యంత్రంగంపై వత్తిడి తెచ్చి గెలిచినట్లు ప్రకటించుకున్నారని ఇది అప్రజాస్వామికమని , ఆగ్రహం వ్యక్తం చేసింది …ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు పరంపర కొనసాగింది ..
90 సీట్లు ఉన్న హర్యానాలో బీజేపీ 48 పైగా సీట్లను గెలిచుకోగా , కాంగ్రెస్ 37 సీట్లకు పరిమితమైంది …ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు …గత ఎన్నికల్లో 10 సీట్లు గెలిచి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న జేపీపీ ఈసారి ఒక్క సీటు గెలవకుండా బోల్తాపడ్డది … ఇక జమ్మూ కాశ్మిర్ లో 90 స్థానాలు ఉండగా 41 సీట్లలో ఎన్సీ జెండా ఎగరవేసింది …కాంగ్రెస్ 6 స్థానాల్లో , బీజేపీ 29 సీట్లలో , పీడీపీ 3 సీట్లను గెలుచుకుంది …గవర్నర్ ద్వారా మరో ఐదు సీట్లు నామినేట్ చేసుకున్న బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు …ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం జమ్మూ కాశ్మిర్ లో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాదని అంచనా వేసినప్పటికీ , ఎన్సీ ,కాంగ్రెస్ కూటమి గెలుపొందడం విశేషం …