కేవలం 32 ఓట్లతో గట్టెక్కిన బీజేపీ అభ్యర్థి
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓటమిని జీర్ణించుకోలేక పోతుంది .ఈవీఎం అలలో తేడాలు ఉన్నాయని , స్థానిక సిబ్బంది సరిగా వ్యవరించలేదని , 10 నియోజకవర్గాల్లో అత్యల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించిందని ఆరోపణలు వెల్లు ఎత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యల్ప ఓట్లతో గెలుపొందిన అభ్యర్థిపై చర్చలు జరుగుతున్నాయి…
కేవలం 32 ఓట్లతో గట్టెక్కిన బీజేపీ అభ్యర్థి
హర్యానాలోని ఉచానా కలాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ అత్రి కేవలం 32 ఓట్ల తేడాతో గెలుపు సాధించారు. అత్రి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన మాజీ IAS అధికారి బ్రిజేందర్ సింగ్‌ను ఓడించారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 90 నియోజకవర్గాల్లో ఇదే అత్యల్ప మెజారిటీ కావడం గమనార్హం.