Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

డంపింగ్ యార్డ్ వద్ద చెత్త డిస్పోజల్ కు ప్రణాళికలు రూపొందించాలి…. మంత్రి పొంగులేటి

డంపింగ్ యార్డ్ వద్ద చెత్త డిస్పోజల్ కు ప్రణాళికలు రూపొందించాలి…. మంత్రి పొంగులేటి

డంపింగ్ యార్డ్ వద్ద చెత్త డిస్పోజల్ కు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి, ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో పర్యటించి ఒకటవ డివిజన్ టి.ఎన్.జి.ఓస్. కాలనీలో టి.యు.ఎఫ్.ఐ.డి.సి. నిధులు ఒక కోటి 15 లక్షల రూపాయలతో చేపట్టిన డంపింగ్ యార్డు అప్రోచ్, ఇంటర్నల్ సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయ్ బాబు లతో కలిసి శంకుస్థాపన చేశారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ ప్రణాళికలు, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేందుకు ప్రణాళికలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్  ఏర్పాటు సంబంధిత అంశాల వివరాలను మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వద్ద ఒకే చోట పెద్ద ఎత్తున చెత్త డంప్ చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, చెత్తను ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలని అన్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరు సేకరణపై మున్సిపల్ సిబ్బందికి శిక్షణ అందించాలని, ప్రజలలో కూడా అవగాహన కల్పించాలని అన్నారు. డంపింగ్ యార్డ్ వద్ద వేసిన చెత్త డిస్పోజ్ ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలని లేని పక్షంలో స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయని అన్నారు.  ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అన్నారు.  డబుల్ బెడ్ రూం ఇండ్లకు కూడా రోడ్డు సౌకర్యం ఉండేలా ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు.  ఒకటవ డివిజన్ లో డంపింగ్ యార్డ్ అప్రోచ్ రోడ్, అంతర్గత రోడ్లకు ప్రభుత్వం కోటి 15 లక్షల రూపాయలు మంజూరు చేసిందని, ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటూ నాణ్యతతో కూడిన రోడ్లు, అగ్రిమెంట్ సమయంలోగా వేయాలని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఒకటవ డివిజన్ కార్పొరేటర్ తేజావత్ హుస్సేన్, ఖమ్మం ఆర్డీఓ గణేష్, ఖమ్మం అర్బన్ తహశీల్దార్ సిహెచ్. స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ రూ. లక్ష సాయం

Drukpadam

ఏళ్ల పాటు సెలవు పెట్టకుండా ఉద్యోగం..90 ఏళ్లకు రిటైర్మెంట్!

Drukpadam

అకాల వర్షాలపై అధికారులతో సీఎం కేసీఆర్  సమీక్ష…!

Drukpadam

Leave a Comment