Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ!

  • గ్రామస్థాయిలో చైర్మన్‌గా సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి 
  • మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్‌గా కౌన్సిలర్ లేదా కార్పోరేటర్
  • కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్

తెలంగాణ సర్కార్ మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల ఆరు గ్యారంటీల హామీల్లో ప్రధానమైనది ఇందిరమ్మ ఇళ్ళు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ళలబ్దిదారులను గుర్తించేందుకు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. గ్రామపంచాయితీల్లో, మున్సిపల్ వార్డు స్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. గ్రామస్థాయిల్లో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి చైర్ పర్సన్ ఉండగా.. మున్సిపాలిటీ స్థాయిల్లో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్ పర్సన్ గా ఉండనున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్ గా పంచాయితీ కార్యదర్శి, వార్డ్ ఆఫీసర్ ఉంటారు. అలాగే కమిటీలో ఇద్దరు ఎస్ హెచ్జీ సభ్యులు, ముగ్గురు స్థానికులు ఉండనున్నారు. కాగా ఈ కమిటీలు శనివారం నాటికి ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయి. కమిటీల కోసం పేర్లు పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కమిటీలు ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు అవగాహన కల్పించడంతోపాటు, అనుమానాలు నివృత్తి చేస్తారు.

గ్రామస్థాయిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి, మున్సిపాలిటీ స్థాయిలో కౌన్సిలర్ లేదా కార్పోరేటర్ చైర్మన్‌గా కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్‌గా ఉంటారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

ఇద్దరు డ్వాక్రా గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ఈ కమిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనసాగనుంది. శనివారం నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీల కోసం పేర్లు పంపించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.

ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఏర్పాటుపై జీవో విడుదల చేసిన సర్కార్

Related posts

 పౌరసరఫరాలశాఖ రూ. 56 వేల కోట్ల నష్టంలో ఉంది..మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి…

Ram Narayana

కేసీఆర్ ను విచారణకు పిలవనున్న జస్టిస్ ఘోష్ కమిషన్…

Ram Narayana

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం జ్యుడిషియల్ కమిషన్!

Ram Narayana

Leave a Comment