Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

కొండారెడ్డిపల్లిలో గంటలు క్షణాల్లా గడిచిపోయాయి: సీఎం రేవంత్ రెడ్డి

  • ప్రతి ఏటా దసరా రోజున సొంతూరికి రేవంత్ రెడ్డి
  • తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో కొండారెడ్డిపల్లికి రాక
  • అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు
  • భావోద్వేగాలకు గురైన రేవంత్ రెడ్డి

ప్రతి ఏటా దసరా పండుగకు రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రావడం ఆనవాయతీగా వస్తోంది. ఈసారి తన సొంతూరికి రేవంత్ రెడ్డి రావడానికి ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో కొండారెడ్డిపల్లి వచ్చారు. నిన్న ఆయనకు లభించిన స్వాగతం మామూలుగా లేదు. 

ఊరు ఊరంతా తరలివచ్చిందా అన్నట్టుగా అపూర్వ స్వాగతం పలికారు. తమ ముద్దుబిడ్డపై పూలు చల్లుతూ, నినాదాలు చేస్తూ గ్రామంలోకి తీసుకెళ్లారు. 

ఇక, సీఎం రేవంత్ రెడ్డి తన సొంతూరులో దసరా సందర్భంగా అనేక ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం ఆయన సోషల్ మీడియాలో భావోద్వేగభరితంగా స్పందించారు. 

గంటలు క్షణాల్లా గడిచిపోయాయి… అనుబంధాలు శాశ్వతమై మిగిలాయి… కొండారెడ్డిపల్లిలో ఈ దసరా నా జీవన ప్రస్థానంలో ఓ ఆత్మీయ అధ్యాయం అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఈ సందర్భంగా తన పర్యటన వీడియోను కూడా పంచుకున్నారు. ఆ వీడియోకు రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంలోని ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా రావడం అందరినీ అలరిస్తోంది.

Related posts

టీజీపీఎస్‌సీ కొత్త ఛైర్మ‌న్‌గా బుర్రా వెంక‌టేశం..!

Ram Narayana

పంటలకు యూరియా వినియోగం తగ్గించే విధంగా అవగాహన కార్యక్రమాలు: మంత్రి తుమ్మల

Ram Narayana

ఎస్ఎల్బీసీ టన్నెల్ లో మరో మృతదేహం గుర్తింపు!

Ram Narayana

Leave a Comment