Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

తెలంగాణాలో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ లు…

డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయండి: క్యాట్‌ను ఆశ్రయించిన అమ్రపాలి

  • డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని క్యాట్‌ను ఆశ్రయించిన నలుగురు అధికారులు
  • తెలంగాణ నుంచి ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్
  • ఏపీలోనే కొనసాగేలా చూడాలని క్యాట్‌ను ఆశ్రయించిన సృజన

తనను తెలంగాణలోనే కొనసాగించాలని, డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ ఆమ్రపాలి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. ఆమ్రపాలితో పాటు మరో ముగ్గురు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం తెలంగాణలో పని చేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ఏపీలో పని చేస్తున్న సృజన క్యాట్‌ను ఆశ్రయించారు.

డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేశారు. తమను తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేయాలని  ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ఏపీలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సృజన వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

వారి పిటిషన్లపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ మంగళవారం విచారణ చేపట్టనుంది. ఏపీకి కేటాయించి తెలంగాణలో కొనసాగుతున్న వారిలో ఐఏఎస్ అధికారులు వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్ ఆమ్రపాలి, ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి ఉన్నారు. తెలంగాణకు కేటాయించి ఏపీలో కొనసాగుతున్న వారిలో ఐఏఎస్ అధికారులు సృజన, శివశంకర్, హరికిరణ్ ఉన్నారు.

Related posts

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌, కవితకు నోటీసులపై స్పందించిన కిషన్ రెడ్డి

Ram Narayana

నాగార్జున పరువు ఎప్పుడో పోయింది…

Ram Narayana

వరద బాధితులకు సాయానికి ముందుకు వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ

Ram Narayana

Leave a Comment