Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్హైకోర్టు వార్తలు

పొన్నవోలుకు పోలీసు భద్రత అవసరంలేదన్న ఏపీ హైకోర్టు… పిటిషన్ డిస్మిస్!

  • పొన్నవోలుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ
  • భద్రత కల్పించాలని కోరుతూ పొన్నవోలు పిటిషన్
  • సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు రిజర్వ్… తాజాగా తీర్పు వెల్లడి

గత ప్రభుత్వ హయాంలో అదనపు అడ్వొకేట్ జనరల్ గా వ్యవహరించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భద్రత కల్పించాలంటూ పొన్నవోలు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పొన్నవోలుకు పోలీసు భద్రత అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు పొన్నవోలు పిటిషన్ ను కొట్టివేసింది.

పొన్నవోలు పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం… ఇవాళ తీర్పును వెలువరించింది. పొన్నవోలుకు ఏపీ న్యాయవర్గాల్లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు ఉంది. ఇవాళ ఆయన సొంత కేసులోనే ఓడిపోయారు.

పొన్నవోలుకు పోలీసు భద్రత అవసరంలేదని హైకోర్టు గతంలో విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. పొన్నవోలు ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని భద్రతా సమీక్ష కమిటీ నిర్ధారించిన విషయాన్ని కూడా హైకోర్టు అప్పట్లో ప్రస్తావించింది. రివ్యూ కమిటీ నివేదికపై అభ్యంతరాలు ఉంటే సవాల్ చేసుకోవచ్చని పొన్నవోలుకు సూచించింది. తాజాగా హైకోర్టు ఏకంగా పిటిషన్ నే కొట్టివేయడంతో పొన్నవోలుకు తీవ్ర నిరాశ తప్పలేదు.

Related posts

సమంతను ప్రీతమ్ జుకాల్కర్ జీజీ అని పిలిచేవారు …జీ జీ అంటే అక్క: మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ …

Drukpadam

జగన్ బెయిల్ రద్దు పై వచ్చే నెల 25న తీర్పు!

Drukpadam

చైనా బెలూన్ల కలకలం.. దేనికైనా రెడీ అంటూ బ్రిటన్ ప్రధాని రిషి సంచలన ప్రకటన!

Drukpadam

Leave a Comment