Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంసైన్సు అండ్ టెక్నాలజీ

జుపిటర్ మీదా బతికేద్దాం.. రూ. 43,700 కోట్లతో నాసా వ్యోమనౌక ప్రయోగం..!

  • జుపిటర్ చంద్రుడు యూరోపాపై పరిశోధనలు
  • దానిపై భూగర్భ సముద్రం ఉందని విశ్వాసం
  • 2.9 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించనున్న ప్రోబ్
  • ఏప్రిల్ 2030 నాటికి గురుగ్రహం కక్ష్యలోకి ప్రోబ్

భూమి కాకుండా ఇతర గ్రహాలపై జీవించేందుకు ఉన్న అనుకూలతలు, అవకాశాలపై విస్తృత పరిశోధనలు చేస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో భారీ వ్యోమనౌకను ప్రయోగించింది. ప్రస్తుతం అంగారకుడిపై పరిశోధనలు జరుగుతుండగా ఇప్పుడు జుపిటర్ (గురుగ్రహం) చల్లని చంద్రుడు యూరోపా మానవ నివాస యోగ్యమేనా? అన్న విషయం తెలుసుకునేందుకు సోమవారం ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్‌ను ప్రయోగించింది. యూరోపాపై అపారమైన భూగర్భ సముద్రం ఉందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో అది మానవ మనుగడకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

భూమిపై కాకుండా మరో గ్రహంపై సముద్రాలు ఉన్నాయా? అని తెలుసుకునేందుకు నాసా చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. ఈ వ్యోమనౌక యూరోపా క్లిప్పర్ 1.8 బిలియన్ మైళ్లు (2.9 బిలియన్ కిలోమీటర్లు) ప్రయాణించి ఏప్రిల్ 2030 నాటికి జుపిటర్ కక్ష్యలోకి చేరుతుంది. ఈ రోబోటిక్ సోలార్ ఆధారిత ప్రోబ్ కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత యూరోపాపై మానవ నివాసానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? అన్న విషయాన్ని పరిశోధిస్తుంది. ఈ మిషన్ కోసం నాసా 5.2 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 43,700 కోట్లు ఖర్చు చేసింది. కాగా, 2015లో ఈ మిషన్‌కు అనుమతి లభించగా ఇందుకోసం ఏకంగా 4 వేల మంది పనిచేశారు.  

Related posts

పపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడిన ఘటన.. 2 వేల మందికి పైగా సజీవ సమాధి!

Ram Narayana

ప్రధాని మోదీ రష్యా పర్యటనకు ముందు రష్యా ఆసక్తికర వ్యాఖ్యలు…

Ram Narayana

ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు మద్దతిచ్చిన భారత్

Ram Narayana

Leave a Comment