Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

దక్షణ కన్నడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం …డాక్టర్ పొంగులేటి

దక్షణ కన్నడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కిషోర్ కుమార్ పుత్తూరు గెలుపు ఖాయమని బీజేపీ కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల సహా ఇంచార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు …మంగళవారం కర్ణాటకలోని బంట్వాలా బంటారా భవనంలో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే బిజె విజయేంద్రతో కలిసి పాల్గొన్నారు …ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు ..

కార్యకర్తల పట్టుదల , ప్రజల స్పందన చూస్తుంటే బీజేపీ విజయాన్ని ఎవరు ఆపలేరనే విశ్వాసం వ్యక్తం చేశారు . కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు చేసిన వాగ్దానాలను విస్మరించిందని ముడా,ఎస్సీ కార్పొరేషన్ రుణాలు , ఎస్సీ ,ఎస్టీ నిధుల దారి మళ్లింపు లాంటి కుంభకోణాలతో పీకల్లోతు అవినీతిలో కూరుకొని పోయిందని ధ్వజమెత్తారు …దేశంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ , అభివృద్ధి చెందిన దేశాల తరుపున భారత్ పతాకాన్ని ద్యేదీప్యమానంగా ఎగర వేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత ఆర్థిక శక్తిగా ఎదగాలంటే బీజేపీని బలపరచాలని సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు .. బీజేపీ అభ్యర్థి శ్రీ కిషోర్ కుమార్ పుత్తూరు అఖండ మెజారిటీతో గెలుపొందడం ద్వారా కర్ణాటకలో బీజేపీ పటిష్టంగా ఉందని చాటిచెప్పాలని అన్నారు ..

పార్టీ సభ్యత్వాన్నిగణనీయంగా పెంచడం , స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యంగా పనిచేయాలని అన్నారు .. కిషోర్ కుమార్ పుత్తూరు గెలుపు కన్నడనాట మలుపు కావాలన్నారు … మంచి నాయకత్వం , పటిష్టమైన క్యాడర్ బలం బీజేపీ సొంతమని కర్ణాటకపై కేంద్ర నాయకత్వం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాయకులు ఐకమత్యంతో పనిచేయడం ద్వారా విజయం సాధించాలని అన్నారు ..

కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి డి.వి. సదానంద గౌడ, కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక, విధాన పరిషత్ ప్రతిపక్ష నాయకుడు చలవాడి నారాయణ స్వామి, ఎంపీలు కోట శ్రీనివాస్ పూజారి , బ్రిజేష్ చౌటా, మాజీ ఎంపీ నలీన్ కుమార్ కటీల్,
దక్షిణ కన్నడ జిల్లా అధ్యక్షుడు సతీష్ కుంపలా, బంట్వాళ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేష్ నాయక్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరయ్యారు…

Dr. Ponguleti Sudhakar Reddy, in-charge of BJP including Karnataka and Tamil Nadu states, said that BJP candidate Kishore Kumar Puttur is certain to win in Dakshana Kannada local body elections…On Tuesday, BJP state president MLA BJ Vijayendra participated in a meeting held at Bantwala Bantara building in Karnataka…On this occasion, he said that Congress in Karnataka He criticized the government’s failures.

He expressed confidence that no one can stop BJP’s success if they see the perseverance of the workers and the response of the people. Congress has ignored the promises made to the people in the elections and flagged that it has become mired in corruption with scandals like SC corporation loans, diversion of SC and ST funds… Prime Minister Narendra Modi, who is running the development of the country and flying the flag of India on behalf of developed countries, has become a more economic power under the leadership of the Prime Minister Narendra Modi. Sudhakar Reddy called to strengthen BJP in order to grow.. BJP candidate Mr. Kishore Kumar Putthur by winning with overwhelming majority said that BJP is strong in Karnataka..

He said that the aim should be to increase the membership of the party significantly and win the elections of the local bodies.. He said that the victory of Kishore Kumar Puttur should be a turning point for Kannada… He said that the leaders should succeed by working with unity without betraying the belief of the central leadership in Karnataka that the BJP has good leadership and strong cadre strength..

Former Chief Minister D.V. Sadananda Gowda, Leader of Opposition in Karnataka Legislative Assembly R. Ashoka, Leader of Opposition in Vidhan Parishad Chalavadi Narayana Swamy, MPs Kota Srinivas Pujari, Brijesh Chauta, former MP Naleen Kumar Katil,
Dakshina Kannada District President Satish Kumpala, Bantwala Constituency MLA Rajesh Naik, many MLAs and MLCs attended the meeting…


कर्नाटक और तमिलनाडु राज्यों सहित भाजपा के प्रभारी डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी ने कहा कि दक्षिण कन्नड़ स्थानीय निकाय चुनाव में भाजपा उम्मीदवार किशोर कुमार पुत्तुर की जीत पक्की है…मंगलवार को भाजपा के प्रदेश अध्यक्ष विधायक बीजे विजयेंद्र ने कर्नाटक के बंटवाला बंटारा भवन में आयोजित बैठक में हिस्सा लिया…इस अवसर पर उन्होंने कहा कि कर्नाटक में कांग्रेस सरकार की विफलताओं की आलोचना की।
उन्होंने विश्वास जताया कि कार्यकर्ताओं की लगन और लोगों की प्रतिक्रिया को देखकर भाजपा की सफलता को कोई नहीं रोक सकता। कांग्रेस ने चुनावों में जनता से किए गए वादों को नजरअंदाज किया है और कहा है कि वह एससी निगम ऋण, एससी और एसटी फंड के डायवर्जन जैसे घोटालों के साथ भ्रष्टाचार में फंस गई है… देश के विकास को चलाने वाले और विकसित देशों की ओर से भारत का झंडा फहराने वाले प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में भारत एक और अधिक आर्थिक शक्ति बन गया है। सुधाकर रेड्डी ने विकास के लिए भाजपा को मजबूत करने का आह्वान किया.. भाजपा उम्मीदवार श्री किशोर कुमार पुत्तुर ने भारी बहुमत से जीत हासिल करके कहा कि कर्नाटक में भाजपा मजबूत है..

उन्होंने कहा कि पार्टी की सदस्यता में उल्लेखनीय वृद्धि करना और स्थानीय निकायों के चुनावों में जीत हासिल करना लक्ष्य होना चाहिए.. उन्होंने कहा कि किशोर कुमार पुत्तुर की जीत कन्नड़ के लिए एक महत्वपूर्ण मोड़ होनी चाहिए… उन्होंने कहा कि नेताओं को कर्नाटक में केंद्रीय नेतृत्व के इस विश्वास को धोखा दिए बिना एकता के साथ काम करके सफल होना चाहिए कि भाजपा के पास अच्छा नेतृत्व और मजबूत कैडर ताकत है..

पूर्व मुख्यमंत्री डी.वी. सदानंद गौड़ा, कर्नाटक विधानसभा में विपक्ष के नेता आर. अशोक, विधान परिषद में विपक्ष के नेता चलावाडी नारायण स्वामी, सांसद कोटा श्रीनिवास पुजारी, ब्रिजेश चौटा, पूर्व सांसद नलीन कुमार कटिल, दक्षिण कन्नड़ जिला अध्यक्ष सतीश कुंपाला, बंटवाला निर्वाचन क्षेत्र के विधायक राजेश नाइक, कई विधायक और एमएलसी बैठक में शामिल हुए…

Related posts

మహారాష్ట్ర… షిండే సేనకు షాకిచ్చిన బీజేపీ

Ram Narayana

కేజ్రీవాల్ జైల్లోనుంచే పాలనకు కోర్ట్ అనుమతి కోరతాం…పంజాబ్ సీఎం భగవంత్ మాన్

Ram Narayana

370 రద్దు సరైందికాదని అక్కడి ప్రజలు తీర్పు ఇచ్చినట్లేనా …?

Ram Narayana

Leave a Comment