తెలంగాణ వార్తలు

నూకల నరేష్ రెడ్డి బిడ్డ అభినవ్ రెడ్డి ని మీ.. బిడ్డగా ఆశీర్వదించండి .. మంత్రులు తుమ్మల ,పొంగులేటి

నూకల నరేష్ రెడ్డి బిడ్డ అభినవ్ రెడ్డిని మీ బిడ్డగా అశ్విర్వదించండి అని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు ..ఇటీవల అనారోగ్యంతో మరణించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు నూకల నరేష్ రెడ్డి దశదిన కర్మ సందర్భంగా జరిగిన సంతాపసభలో పాల్గొని ప్రసంగించారు … ఈసందర్భంగా నూకల నరేష్ రెడ్డి బాటలో పయనించాలని అందుకు ప్రతి ఒక్కరు ప్రతిన భూనాలని వారు అన్నారు …ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఆయన అభిమానులను సంపాదించుకోవడం చిన్న విషయం కాదని అన్నారు …ప్రజల అభిమానం చూరగొన్న ప్రజానాయకుడు నరేష్ రెడ్డికి ఘనమైన నివాళులు అర్పించారు …

నాలుగు దశాబ్దాలుగా మీరు నరేష్ రెడ్డి పై చూపిన అభిమానం అద్బుతం.. వారికి ఆశృనివాళులు అర్పించేందుకు వేలాదిగా తరలివచ్చిన మీ.. అభిమానం నూకల కు నిజమైన నివాళి…యువత మీ..సోదరునిగా అభినవ్ ను ఆదరించండి… దీవించండి, నూకల నరేష్ రెడ్డి వారసత్వాన్ని కాపాడే దిశగా వెంటుండి ముందుకు నడిపించండి..* పురుషోత్తమాయగూడెం లో జరిగిన కాంగ్రెస్ నాయకులు నూకల నరేష్ రెడ్డి సంతాప సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతోపాటు ఖమ్మం యంపి రామసహాయం రఘురాంరెడ్డి.. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు ..

Related posts

నాగార్జున సత్యహరిచంద్రుడు ఏమి కాదు …సిపిఐ నేత నారాయణ విసుర్లు

Ram Narayana

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా రజనీకాంత్, నాగరాజు

Ram Narayana

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Ram Narayana