Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హైకోర్టు లో ఏపీ సర్కార్కు మరో ఎదురు దెబ్బ…

హైకోర్టు లో ఏపీ సర్కార్కు మరో ఎదురు దెబ్బ
మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా సంచయిత నియామకం రద్దు..
అశోక్ గ‌జ‌ప‌తిరాజును పునర్నియమించాలని హైకోర్టు ఆదేశం
ప్ర‌స్తుతం ట్ర‌స్టుకు ఛైర్మ‌న్‌గా సంచ‌యిత‌
హైకోర్టును ఆశ్ర‌యించిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు
ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులను ర‌ద్దు చేయాల‌ని విన‌తి
సానుకూలంగా తీర్పు

ఏపీ సర్కార్ కు హైకోర్టు లో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది….మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా సంచయిత ను నియమిస్తూ జగన్ సర్కార్ చేసిన నియామకం రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై తెలుగు దేశం హర్షం ప్రకటించినది. అడ్డగోలు జి ఓ లకు ఇది చెంపపెట్టని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు …. దేశంలో ఏముఖ్యమంత్రి ఇన్నిసార్లు కోర్ట్ లో తలదించుకున్నదిలేదని అన్నారు. దేశంలో చట్టాలు ఉన్నాయని మరోసారి రుజువైందని అశోక గజపతిరాజు అన్నారు. ప్రభుత్వం దేవాదాయశాఖ మంత్రి వెళ్లపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ కోర్ట్ తీర్పును పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను స‌వాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న తర్వాత త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది.

గ‌తంలో సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ర‌ద్దు చేసింది. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా పునర్నియమించాలని పేర్కొంది. ప్ర‌స్తుతం ఆ ట్ర‌స్టుకు సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజు ఛైర్మ‌న్‌గా ఉన్న విష‌యం తెలిసిందే.

జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు : మాన్సాస్ వ్యవహారంపై చంద్రబాబు స్పందన

ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి నియామకాన్ని రద్దు చేస్తూ, చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు స్పందించారు. మాన్సాస్ ట్రస్టు కేసులో హైకోర్టు తీర్పు హర్షణీయమని పేర్కొన్నారు. కోర్టు తీర్పు వేల మంది ఉద్యోగులకు అండగా నిలిచిందని తెలిపారు.

అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదన్న విషయం తాజా తీర్పుతో వెల్లడైందని పేర్కొన్నారు. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి స్పష్టమైందని అన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలోని వేలాది భూముల్ని కొల్లగొట్టాలన్న జగన్ దుర్మార్గ ఆలోచనలకు అడ్డుకట్ట పడిందన్నారు. హైకోర్టు తీర్పుతో తుగ్లక్ ముఖ్యమంత్రికి చెంపపెట్టు అని అభివర్ణించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కోర్టులో ఇన్నిసార్లు తలదించుకున్నది లేదని చంద్రబాబు విమర్శించారు. ఇకనైనా ముందు వెనుకలు ఆలోచించకుండా జీవోలు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు. ట్రస్టును కాపాడుకున్నారంటూ అశోక్ గజపతిరాజుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.

దేశంలో చట్టాలున్నాయని మరోసారి రుజువైంది: అశోక్ గజపతిరాజు

మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవాలయ ట్రస్టు బోర్డు చైర్మన్ గా తన పునర్నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు స్పందించారు. దేశంలో చట్టాలున్నాయని మరోసారి రుజువైందని అన్నారు. తాను ట్రస్టు చైర్మన్ గా వ్యవహరించిన సమయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేశారని, అక్రమాలు నిజంగానే జరిగుంటే ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు.

తనపై కక్షతో మాన్సాస్ ట్రస్టు ఉద్యోగులను పలు ఇబ్బందులకు గురిచేశారని, ఈ క్రమంలోనే మాన్సాస్ ట్రస్టు కార్యాలయాన్ని మరోచోటికి తరలించారని వెల్లడించారు. ఆఖరికి మూగజీవాలను కూడా హింసించారని, రాక్షసులు కూడా ఇలా చేసివుండరని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. తీర్పు ఉత్తర్వులు అందాక మిగతా వివరాలు అందిస్తానని తెలిపారు.

మాన్సాస్ ట్రస్టు విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నాం: ఏపీ మంత్రి వెల్లంపల్లి

మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ట్రస్టు పాలకవర్గంపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీఎం జగన్ ను కలిసి తాజా పరిణామాలను నివేదించారు. అనంతరం మాట్లాడుతూ, మాన్సాస్ ట్రస్టు విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కోర్టు ఆదేశాలను బట్టి మళ్లీ అప్పీల్ కు వెళతామని చెప్పారు. తాము ఏం చేసినా చట్టప్రకారం, న్యాయబద్ధంగానే ముందుకు వెళతామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. మాన్సాస్ ట్రస్టు అంశంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

అటు, బ్రహ్మంగారి మఠం అంశంలోనూ ఇదే పంథా అనుసరిస్తామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. బ్రహ్మంగారి మఠం వివాదాన్ని సీఎంకు వివరించామని, ఆయన నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారని వెల్లడించారు. మఠానికి సంబంధించిన వీలునామా చట్టప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్ కు చేరాలని అన్నారు. దీనిపై పీఠాధిపతులతో కమిటీ వేసి చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బ్రహ్మంగారి మఠం విషయంలో శివస్వామి ముందుగానే నిర్ణయాన్ని ప్రకటించడం సరికాదని మంత్రి వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related posts

దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు: మంద కృష్ణ మాదిగ!

Drukpadam

స్పీడు పెంచిన కాసాని.. తెలంగాణ టీడీపీకి కొత్త కార్యవర్గం …

Drukpadam

బీజేపీ కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ఈటల

Drukpadam

Leave a Comment