- రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారన్న సంజయ్
- ఆయనను పీఠం నుంచి దింపేయాలని గోతికాడ నక్కల్లా చూస్తున్నారని వ్యాఖ్య
- హైడ్రా, మూసీ, గ్రూప్-1 అంశాల్లో రేవంత్ రెడ్డి జాగ్రత్తపడాలని సూచన
ప్రజల్లో రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత రావాలని కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులే చూస్తున్నారని, ఆయన జాగ్రత్తపడకపోతే చిక్కులు తప్పవని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను పీఠం నుంచి దింపేయాలని గోతికాడ నక్కల్లా మంత్రులు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
హైడ్రా, మూసీ, గ్రూప్-1 విషయంలో రేవంత్ రెడ్డి జాగ్రత్తపడాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని అలర్ట్ చేశారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా, రాక్షసంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం చిల్లర రాజకీయం చేస్తోందని, పేదల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.