తెలంగాణ వార్తలు

 తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా!

  • ఈ నెల 23న జరగాల్సిన కేబినెట్ సమావేశం
  • రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం
  • సమావేశం వాయిదా పడినట్లు వెల్లడించిన సీఎస్

ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని వెల్లడించారు. కేబినెట్ సమావేశం వాయిదా పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ కేబినెట్ సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించడం, రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, రైతుభరోసా తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related posts

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Ram Narayana

విషమంగా తమ్మినేని ఆరోగ్యం …తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎఐజీ ఆసుపత్రి

Ram Narayana

కోకాపేటలో అత్యధికంగా ఎకరా భూమి రూ.100 కోట్లు

Ram Narayana