Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

మహారాష్ట్ర ఎన్నికలకు అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ…

  • మహారాష్ట్రలో నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు
  • ఈ నెల 22న నోటిఫికేషన్
  • నేడు తొలి జాబితా ప్రకటించిన బీజేపీ హైకమాండ్

మహారాష్ట్రలో నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, జాబితాల విడుదల వంటి పనులతో బిజీగా ఉన్నాయి. తాజాగా, బీజేపీ కూడా అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 99 మంది అభ్యర్థులతో బీజేపీ నేడు తొలి జాబితా ప్రకటించింది. 

డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఆయన నాగపూర్ నైరుతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే కంతి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ భోకర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 

బీజేపీ తొలి జాబితాలో… ముంబయి బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ సేలార్, లోక్ సభ ఎంపీ నారాయణ్ రాణే కుమారుడు నితీశ్ రాణే కూడా చోటు దక్కించుకున్నారు. 

మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా, అన్నింటికీ ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. త్వరలోనే బీజేపీ తన తదుపరి జాబితా విడుదల చేయనుంది.

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా …

నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ – దేవేంద్ర గంగాధరరావు ఫడ్నవీస్
కమ్తి – చంద్రశేఖర్ కృష్ణారావు బవాన్కులే
షహదా (ఎస్టీ) – రాజేష్ ఉదేసింగ్ పద్వీ
నందుర్బార్ (ఎస్టీ) – విజయ్కుమార్ కృష్ణారావు గావిట్
ధూలే సిటీ – అనూప్ అగర్వాల్
సింధ్‌ఖేడా – జైకుమార్ జితేంద్రసింగ్ రావల్
శిర్పూర్ (ఎస్టీ ) – కాశీరాం వెచన్ పవారా
రేవర్ – అమోల్ జవాలే
భుసావల్ (ఎస్సీ ) – సంజయ్ వామన్ సావ్కరే
జల్గావ్ సిటీ – సురేష్ దాము భోలే (రాజుమామ)
చాలీస్‌గావ్ – మంగేష్ రమేష్ చవాన్
జామ్నేర్ – గిరీష్ దత్తాత్రే మహాజన్
చిఖ్లీ – శ్వేతా విద్యాధర్ మహాలే
ఖమ్‌గావ్ – ఆకాష్ పాండురంగ్ ఫండ్కర్
జల్గావ్ (జామోద్) – డా. సంజయ్ శ్రీరామ్ కుటే
అకోలా ఈస్ట్ – రణధీర్ ప్రహ్లాదరావు సావర్కర్
ధమన్‌గావ్ రైల్వే – ప్రతాప్ జనార్దన్ అద్సాద్
అచల్పూర్ – ప్రవీణ్ తైడే
డియోలీ – రాజేష్ బకనే
హింగన్‌ఘాట్ – సమీర్ త్రయంబక్రావ్ కునావర్
వార్ధా – డా. పంకజ్ రాజేష్ భోయార్
హింగ్నా – సమీర్ దత్తాత్రయ మేఘే
నాగ్‌పూర్ సౌత్ – మోహన్ గోపాలరావు మాటే
నాగ్‌పూర్ ఈస్ట్ – కృష్ణ పంచమ్ ఖోప్డే
తిరోరా – విజయ్ భరత్‌లాల్ రహంగ్‌డేల్
గోండియా – వినోద్ అగర్వాల్
అమ్‌గావ్ (ఎస్టీ ) – సంజయ్ హన్వంతరావ్ పురం
ఆర్మోరి (ఎస్టీ) – కృష్ణ దామాజీ గజ్బే
బల్లార్‌పూర్ – సుధీర్ సచ్చిదానంద్ ముంగంటివార్
చిమూర్ – బంటీ భంగడియా
వాని – సంజీవరెడ్డి బాపురావ్ బొడ్కుర్వార్
రాలేగావ్ – డా. అశోక్ రామాజీ ఉయికే
యావత్మాల్ – మదన్ మధుకరరావు యెరావార్
కిన్వాట్ – భీమ్రావ్ రాంజీ కేరం
భోకర్ – శ్రీజయ అశోక్ చవాన్\
నాయిగావ్ – రాజేష్ శంభాజీ పవార్
ముఖేద్ – తుషార్ రాథోడ్
హింగోలి – తానాజీ ముట్కులే
జింటూర్ – మేఘనా బోర్డికర్
పర్చూరు – బాబాన్‌రావ్ లోనికర్
బద్నాపూర్ (ఎస్సీ) – నారాయణ్ కుచే
భోకర్దన్ – సంతోష్ రావుసాహెబ్ దాన్వే
ఫులంబ్రి – అనురాధతై అతుల్ చవాన్
ఔరంగాబాద్ తూర్పు – అతుల్ సేవ్
గంగాపూర్ – ప్రశాంత్ బాంబ్
బగ్లాన్ (ఎస్టీ) – దిలీప్ మంగ్లూ బోర్సే
చాంద్వాడ్ – డాక్టర్ రాహుల్ దౌలత్రావ్ అహెర్
నాసిక్ ఈస్ట్ – రాహుల్ ఉత్తమ్రావ్ ధికాలే
నాసిక్ వెస్ట్ – సీమటై మహేష్ హిరే
నలసోపరా – రాజన్ నాయక్
భివాండి వెస్ట్ – మహేష్ ప్రభాకర్ చౌఘులే
ముర్బాద్ – కిసాన్ శంకర్ కథోర్
కళ్యాణ్ ఈస్ట్ – సులభ కలు గైక్వాడ్
డోంబివాలి – రవీంద్ర దత్తాత్రే చవాన్
థానే – సంజయ్ ముకుంద్ కేల్కర్
ఐరోలి – గణేష్ నాయక్
బేలాపూర్ – మందా విజయ్ మ్హత్రే
దహిసర్ – మనీషా అశోక్ చౌదరి
ములుండ్ – మిహిర్ కొటేచా
కండివాలి ఈస్ట్ – అతుల్ భత్ఖల్కర్
చార్కోప్ – యోగేష్ సాగర్
మలాడ్ వెస్ట్ – వినోద్ షెలార్
గోరేగావ్ – విద్యా జైప్రకాష్ ఠాకూర్
అంధేరి వెస్ట్ – అమీత్ సతా
విలే పార్లే – పరాగ్ అలవాని
ఘట్కోపర్ వెస్ట్ – రామ్ కదమ్
వాండ్రే వెస్ట్ – ఆశిష్ షెలార్
సియోన్ కోలివాడ – కెప్టెన్ ఆర్. తమిళ్ సెల్వన్
వడాలా – కాళిదాస్ నీలకంత్ కొలంబ్కర్
మలబార్ హిల్ – మంగళ్ ప్రభాత్ లోధా
కొలాబా – రాహుల్ సురేష్ నార్వేకర్
పన్వేల్ – ప్రశాంత్ ఠాకూర్
ఉరాన్ – మహేష్ బల్ది
దౌండ్ – రాహుల్ సుభాష్రావ్ కులు
చించ్వాడ్ – శంకర్ జగ్తాప్
భోసారి – మహేష్ (దాదా) కిసాన్ లాంగే
శివాజీనగర్ – సిద్ధార్థ శిరోల్
కోత్రుద్ – చంద్రకాంత్ దాదా బచ్చు పాటిల్
పార్వతి – మాధురి సతీష్ మిసల్
షిర్డీ – రాధాకృష్ణ ఏకనాథరావు విఖే పాటిల్
షెవ్‌గావ్ – మోనికా రాజీవ్ రాజలే
రాహురి – శివాజీరావు భానుదాస్ కర్దిలే
శ్రీగొండ – ప్రతిభా పచ్చపుటే
కర్జాత్-జామ్‌ఖేడ్ – రామ్ శంకర్ షిండే
కైజ్ (ఎస్సీ ) – నమితా ముండాడ
నీలంగా – శంభాజీ పాటిల్ నీలంగేకర్
ఔసా – అభిమన్యు పవార్
తుల్జాపూర్ – రణజగ్జిత్సిన్హా పద్మసింహ పాటిల్
షోలాపూర్ సిటీ నార్త్ – విజయ్‌కుమార్ దేశ్‌ముఖ్
అక్కల్‌కోట్ – సచిన్ కళ్యాణశెట్టి
షోలాపూర్ సౌత్ – సుభాష్ దేశ్‌ముఖ్
వ్యక్తి – జయకుమార్ భగవాన్‌రావ్ గోర్
కరాడ్ సౌత్ – డా. అతుల్ సురేష్ భోసలే
సతారా – ఛత్రపతి శివేంద్ర రాజే భోసలే
కంకవ్లి – నితేష్ నారాయణ్ రాణే
కొల్హాపూర్ సౌత్ – అమల్ మహాదిక్
ఇచల్‌కరంజి – రాహుల్ ప్రకాష్ అవడే
మిరాజ్ (ఎస్సీ ) – సురేష్ ఖాడే
సాంగ్లీ – సుధీర్ దాదా గాడ్గిల్

Related posts

బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు…

Ram Narayana

మాల్దీవుల వ్యవహారంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు

Ram Narayana

 హర్యానాలో బీజేపీ గెలుపు… కాంగ్రెస్, ఠాక్రే శివసేన మధ్య మాటల యుద్ధం!

Ram Narayana

Leave a Comment