Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైకోర్టు వార్తలు

ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన‌ అల్లు అర్జున్… కార‌ణం ఏంటంటే..!

  • ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్ర త‌ర‌ఫున నంద్యాల‌లో బ‌న్నీ ప్రచారం
  • ఈ కార్య‌క్ర‌మానికి భారీగా త‌ర‌లివ‌చ్చిన జనం
  • ముంద‌స్తు అనుమ‌తి లేకుండా కార్య‌క్ర‌మం నిర్వహించారంటూ వీఆర్ఓ పోలీసుల‌కు ఫిర్యాదు
  • దీంతో అల్లు అర్జున్‌తో పాటు శిల్పార‌విపై కేసు న‌మోదు
  • ఈ కేసు విష‌య‌మై తాజాగా ఏపీ హైకోర్టులో బ‌న్నీ క్వాష్ పిటిష‌న్‌ దాఖ‌లు

టాలీవుడ్ న‌టుడు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఏపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైసీపీ అభ్య‌ర్థి శిల్పా ర‌విచంద్ర త‌ర‌ఫున నంద్యాల‌లో ఈ ఏడాది మే 11వ తేదీన‌ బ‌న్నీ ప్ర‌చారంలో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి అభిమానులు, జ‌నాలు పోటెత్తారు.

అయితే, ఈ కార్య‌క్ర‌మానికి శిల్పార‌వి గానీ, అల్లు అర్జున్ త‌ర‌ఫున గానీ ముంద‌స్తు అనుమ‌తి తీసుకోలేదు. ఈ నేప‌థ్యంలో స్థానిక వీఆర్ఓ అనుమ‌తి లేకుండా భారీ జ‌న స‌మీక‌ర‌ణ జ‌రిగిందంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దాంతో శిల్పార‌వితో పాటు బ‌న్నీపై సెక్ష‌న్ 144, పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘ‌న‌ కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. 

ఈ కేసు విష‌య‌మై తాజాగా అల్లు అర్జున్‌ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌పై న‌మోదైన కేసును కొట్టివేయాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌ను న్యాయ‌స్థానం స్వీక‌రించింది. మంగ‌ళ‌వారం విచారించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.   

Related posts

కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

Ram Narayana

హిందూ వివాహంలో కన్యాదానం తప్పనిసరి కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

వైఎస్​ వివేకా హత్య కేసులో దస్తగిరి పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

Ram Narayana

Leave a Comment