Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భార్య‌తో క‌లిసి ర‌క్త‌దానం చేసిన చిరంజీవి!

భార్య‌తో క‌లిసి ర‌క్త‌దానం చేసిన చిరంజీవి!
నేడు ప్ర‌పంచ ర‌క్త‌దాతల దినోత్స‌వం
ర‌క్త‌దాత‌లంద‌రినీ అభినందిస్తున్నానన్న చిరు
ర‌క్త‌దానం చేసి ఇత‌రుల ప్రాణాలు కాపాడాల‌ని పిలుపు

నేడు ప్ర‌పంచ ర‌క్త‌దాతల దినోత్స‌వం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న భార్య‌తో క‌లిసి ర‌క్త‌దానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నేడు ప్ర‌పంచ ర‌క్త‌దాతల దినోత్స‌వం సంద‌ర్భంగా ర‌క్త‌దాత‌లంద‌రినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు.

ర‌క్త‌దానం చేసి ఇత‌రుల ప్రాణాలు కాపాడే గొప్ప‌ అవకాశం మ‌న‌కు ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ర‌క్త‌దానం చేయాల‌ని అభిమానులకు పిలుపునిచ్చారు. కాగా, చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ద్వారా గత కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి ర‌క్త‌దానాన్ని ప్రోత్స‌హిస్తూ, ఆపదలో వున్న వారికి రక్తాన్ని అందిస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వేళ ఆక్సిజ‌న్ ను కూడా అందిస్తూ ఆయ‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తున్నారు. చిరంజీవి రక్తదానం చేయడంపై అభిమానులు దటీస్ చిరంజీవి అంటున్నారు. ఆయన సేవ కార్యక్రమాలను కొనియాడుతున్నారు . పలువురు ప్రముఖులు చిరంజీవిని ప్రశంశలతో ముంచెత్తారు . ఇటీవలనే సినీ కార్మికులకు ఆయన అండగా నిలబడ్డారు.

Related posts

భారత్ ఇంధన అవసరాలు తీర్చేందుకు ఇరాన్ సంసిద్ధత

Drukpadam

త‌ల్లితో క‌లిసి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్‌…

Ram Narayana

10 Reasons You Need to Add Squalane Into Your Skincare Routine

Drukpadam

Leave a Comment