Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ల నియామకం పై తెలుగు దేశం : ముగ్గురిపై క్రిమినల్ కేసులన్న వర్ల…

ఎమ్మెల్సీ ల నియామకం పై తెలుగు దేశం  : ముగ్గురిపై క్రిమినల్ కేసులన్న వర్ల
-ఈ మేరకు గవర్నర్ కు లేఖ
-గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటా ఫైలుకు గవర్నర్ ఆమోద ముద్ర
-తోట త్రిమూర్తులుపై 20 నెలలుగా విచారణ
-హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న రమేశ్ యాదవ్
-గవర్నర్‌కు రాసిన లేఖలో వర్ల రామయ్య ఆరోపణ

ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల కోటాలో లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజుకు సంబంధించిన ఫైలుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. దీంతో వారు త్వరలోనే పదవులు చేపట్టనున్నారు. అయితే గవర్నర్ ఆమోదించిన వారిలో ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాశారు.వారి నియామకంపై పునరాలోచన చేయాలన్నారు.

ఎస్సీ యువకుడికి శిరోముండనం చేసిన కేసులో తోట త్రిమూర్తులు 20 నెలులగా విచారణ ఎదుర్కొంటున్నారని, ఆయనపై పలు క్రిమినల్ కేసులు కూడా పెండింగులో ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. లేళ్ల అప్పిరెడ్డి పేరు కూడా పోలీసు రికార్డుల్లో నమోదై ఉందని తెలిపారు. ఓ హత్య కేసులో రమేశ్ యాదవ్ విచారణను ఎదుర్కొంటున్నారని వర్ల రామయ్య ఆ లేఖలో పేర్కొన్నారు.కేసుల్లో ఉన్న వారు నిందితులు మాత్రమేనని వారిని దోషులుగా కోర్ట్ లు తేల్చలేదని వైసిపి వర్గాలు అంటున్నాయి. టీడీపీ ప్రతిదాన్ని భూత అద్దంలో చూడటం అలవాటు అయిందని తమ హాయంలోజరిగిన నియామకాలపై చర్చకు సిద్దమేనా అని ప్రశ్నించింది.

Related posts

ఓ పార్టీలో గెలిచి.. ఇంకో పార్టీలో చేరితే ఉరి శిక్ష వేయాలి: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

బేగంపేట సభలో టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన మోదీ!

Drukpadam

రైల్వేలో ప్రవేట్ కూత …కోయంబత్తూర్ టు షిరిడీ సర్వీస్ ప్రారంభం…

Drukpadam

Leave a Comment