Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

లీగల్ నోటీసులు ఇస్తా.. సోషల్ మీడియా ప్రచారంపై జగ్గారెడ్డి సీరియస్

లీగల్ నోటీసులు ఇస్తా.. సోషల్ మీడియా ప్రచారంపై జగ్గారెడ్డి సీరియస్

సోషల్ మీడియా లో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ ఎవరైనా తనపై తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు పోస్టులు పెట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. మహిళా కలెక్టర్‌ను తాను ఏమీ అనలేదని అన్నారు. ట్రోలింగ్ చేస్తే లీగల్ నోటీసులు ఇస్తానని మండిపడ్డారు.

కాగా, మహిళా కలెక్టర్‌ పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతున్నట్లు సమాచారం. పదిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో చివరకు కలెక్టర్ పీఏకు ఫోన్ చేశారని, కలెక్టర్ ఆఫీసులో ఉన్నారా? ఇంట్లో పడుకున్నారా అని జగ్గారెడ్డి మాట్లాడినట్లు వీడియోలో ఉందని సమాచారం. ప్రస్తుతం జగ్గారెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఆయన స్పందించి తనపై నెట్టింట్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

Related posts

సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానిది…కిషన్ రెడ్డి

Ram Narayana

డీఏ పెండింగ్ పై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి …

Ram Narayana

చేతిలో ఓటరు లిస్ట్.. జేబులో డబ్బుల కట్టలు..

Ram Narayana

Leave a Comment