Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

లాయర్లకు ఉన్న లగ్జరీ మాకెక్కడిది? సిజెఐ చంద్రచూడ్…

లాయర్లకు ఉన్న లగ్జరీ మాకెక్కడిదని చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా చంద్రచూడ్ అన్నారు .. వచ్చే నెలలో రిటైర్ కానున్న సీజేఐ ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ..తాము ఎలాంటి కేసులు అయినా ఇష్టం ఉన్న లేకపోయినా వినాల్సిందేనని అన్నారు .కానీ లాయర్లకు ఎలాంటి కేసులు వాదించాలో ఎంపిక చేసుకునే హక్కు ఉన్నాడని అది తమకు లేదని అన్నారు ..ప్రధానంగా బొంబాయి హైకోర్టు జడ్జిలకు దైర్యం ఎక్కువ ,స్వతంత్రం ఎక్కువని సీజేఐ చెప్పడం ఆసక్తిగా మారింది …

న్యాయవాదులకు ఉండే లగ్జరీ న్యాయమూర్తులకు ఉండదని అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. ఎలాంటి కేసులు వాదించాలో ఎంచుకునే హక్కు లాయర్లకు ఉంటుంది కానీ..

ఏ కేసుని వినాలో ఎంపికచేసుకునే హక్కు తమకు లేదని.. వచ్చే ప్రతీ కేసు వినాల్సిందే అని అన్నారు.

“” నాకు కమర్షియల్ కేసులు వినడం వాదోపవాదాలు విన్నాక తీర్పు ఇవ్వడంలో అనుభవం లేదు. కానీ ఆ కేసులు కూడా నేను వినాల్సిందే. కొన్ని సార్లు అసలు ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వడానికి కూడా కుదరదు. అయినా సరే.. వినాల్సిందే.. తీర్పు చెప్పాల్సిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నాక తొలి రోజుల్లో ఎంతో కంగారు పడిపోయేవాడిని. నా ఉద్దేశంలో బాంబే హైకోర్టుకి ఉన్న స్వతంత్రం ఎవ్వరికీ లేదు. ఆ కోర్టు జడ్జిలకు ధైర్యం ఎక్కువ. కానీ లాయర్లకు ఉండే లగ్జరీ మాత్రం మాకు ఉండదు. మేం అన్ని కేసులు వినాలి. తీర్పు చెప్పాలి “” అన్నారు.

Related posts

ప్రకంపనలు సృష్టిస్తున్న జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్…

Ram Narayana

మదర్ డెయిరీ పాల ధరలూ పెరిగాయ్.. లీటర్ కు రూ. 2 చొప్పున వడ్డన!

Ram Narayana

మేనకా గాంధీపై ఇస్కాన్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా

Ram Narayana

Leave a Comment