Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు…

  • అక్టోబర్ 12 – 27 మధ్య మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్శిటీ బృందం సాహస యాత్ర
  • ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకుని అరుదైన ఘనత సాధించిన విద్యార్ధులు
  • దేశంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకున్న తొలి ప్రైవేటు విద్యాసంస్థ బృందం తమదేనని వెల్లడి

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీకి చెందిన పలువురు అధ్యాపకులు, విద్యార్ధులు సాహస యాత్ర చేశారు. ఈ సాహస యాత్రలో భాగంగా ఈ బృందం ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకుని అరుదైన ఘనతను సాధించింది. 

వర్శిటీ డైరెక్టర్ సిద్ధార్థ త్రిపాఠి నాయకత్వంలో మొత్తం 18 మంది అధ్యాపకులు, విద్యార్ధులు ఈ నెల 12న అమరావతి నుంచి బయలుదేరారు. అక్టోబర్ 20న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు ఈ బృందం చేరుకుంది. ఈ బృందం తొలుత ఖాట్మాండుకు చేరుకుంది. అక్కడ నుంచి 134 కిలోమీటర్లు ప్రయాణించి ..5,364 మీటర్ల (17,598 అడుగులు) ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్‌ క్యాంపునకు చేరుకుంది. 

ఈ సాహస యాత్ర అక్టోబర్ 12 – 27 మధ్య జరిగింది. ఈ సందర్భంగా వర్శిటీ ప్రతినిధులు మాట్లాడుతూ .. దేశంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు చేరుకున్న తొలి ప్రైవేటు విద్యాసంస్థ బృందం తమదేనని తెలిపారు. 

Related posts

ఆపిల్ వాచ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక!

Drukpadam

విమానం టాయ్ లెట్ లో ‘30 నిమిషాల్లో బాంబ్ బ్లాస్ట్’ చీటీ! నిలిచిన టేకాఫ్!

Ram Narayana

కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ పార్టీ మరోసారి అల్టిమేటం..!

Drukpadam

Leave a Comment