Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

హైదరాబాద్‌లో క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం…

  • రాంకోఠిలోని హోల్ సేల్ దుకాణంలో ప్రమాదం
  • ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించిన అధికారులు
  • భయంతో బయటకు పరుగు తీసిన జనం

హైదరాబాద్‌లో ఓ క్రాకర్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాంకోఠిలోని (బొగ్గులకుంట) హోల్‌సేల్ క్రాకర్స్ దుకాణంలో టపాసులు పేలి మంటలు చెలరేగాయి. 4 ఫైరింజన్ల సాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఒకరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగినప్పుడు క్రాకర్స్ దుకాణంలోనూ చాలామంది ఉన్నారు. వారు ఒకరినొకరు తోసుకుంటూ బయటకు వచ్చారు. క్రాకర్స్ దుకాణం పక్కనే హోటల్ ఉంది. హోటల్ నుంచి కూడా జనం భయంతో బయటకు పరుగు తీశారు. దేవాదాయ శాఖ కార్యాలయానికి సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో పదికి పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.

Related posts

హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా!

Ram Narayana

మియాపూర్‌లో టెకీ దారుణ హ‌త్య.. ఆమె నివాసంలోనే పొడిచి చంపిన దుండ‌గులు!

Ram Narayana

చైతన్యపురిలో ఈటల రాజేందర్ ర్యాలీ… మొరపెట్టుకున్న మూసీ నిర్వాసితులు…

Ram Narayana

Leave a Comment