- ఇది అన్నా చెల్లెళ్ల వివాదం… వారే పరిష్కరించుకుంటారన్న నారాయణ
- కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకని వ్యాఖ్య
- ఆస్తుల తగాదాపై అవసరమైతే విజయమ్మ కలగజేసుకుంటారన్న నారాయణ
జగన్-షర్మిల ఆస్తుల వివాదంపై సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అన్నాచెల్లెళ్ల వివాదంలో బయటివారు నోరు మూసుకోవాలన్నారు. వారి వివాదాన్ని వారే పరిష్కరించుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ద్వారా స్పందించారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నారు. ఆస్తుల వివాదంపై విజయమ్మ చాలా స్పష్టంగా చెప్పారని, కాబట్టి బయటివారు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
ఇది అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న వ్యవహారమని, బయటివారు నోరు మూసుకోవడం మంచిదన్నారు. వారే పరిష్కరించుకుంటారన్నారు. జగన్-షర్మిలది కుటుంబ వ్యవహారమన్నారు. రాజకీయ అంశం కాదన్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య వచ్చిన ఆస్తి తగాదాలని… వారు కోర్టుకు కూడా వెళ్లవచ్చు… ఏం చేస్తారో మనకు తెలియదు.. కానీ బయటి వారు అనవసరంగా నోరు పారేసుకోవద్దన్నారు.
వాళ్లు తెలివైనా వారేనని… వాళ్లే పరిష్కరించుకుంటారని సూచించారు. వారికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇది అన్నాచెల్లెళ్ల వ్యవహారమని… అవసరమైతే వాళ్ల అమ్మ జోక్యం చేసుకుంటుందన్నారు. మిగతావారు ఈ అంశం గురించి మాట్లాడటం సమంజసం కాదన్నారు.