Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తానా ద్వారా తెలుగు రాష్ట్రాలకు కాన్సంట్రేటర్లు,వెంటిలెటర్సు

కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాపాయం నుండి కాపాడేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు అమెరికా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) సంస్థ ద్వారా 700 కాన్సంట్రేటర్ లు, 100 వెంటిలేటర్ లు సమకూర్చింది.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సూచన మేరకు ఖమ్మంకు 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లు, 10 వెంటిలేటర్ లను ఖమ్మం కు కేటాయించిన విషయం విధితమే.

ఈ మేరకు TANA మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి అప్పగించిన ఆయా 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 10 వెంటిలేటర్లను జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ గారికి అప్పగించారు. ఆయా పరికరాలు చికిత్స పొందే వారికి అందించనున్నారు.

కార్యక్రమంలో జై తాళ్లూరి , కుర్రా శ్రీనాథ్ , మేయర్ పునుకొల్లు నీరజ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ , ఉప మేయర్ ఫాతిమా , తదితరులు ఉన్నారు.

Related posts

అవినీతి ,మత రాజకీయాలను పాతరేసిన కన్నడిగులు…

Drukpadam

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి….

Drukpadam

విజయవంతంగా టీయుడబ్ల్యూజే సంగారెడ్డి జిల్లా మహాసభ!

Drukpadam

Leave a Comment