శ్వేతా సౌధంపై మరోసారి ట్రంప్…అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం …
ట్రంప్ కు 277 …కమల హారిస్ కు 224 ఎలక్టోరల్ ఓట్లు
అమెరికన్ల మనసు గెలుచుకున్న ట్రంప్ …
131 ఏళ్ల తర్వాత… డొనాల్డ్ ట్రంప్ అరుదైన రికార్డ్
అధ్యక్షుడిగా ఓడిపోయి… ఆ తర్వాత విజయం సాధించిన ట్రంప్
1892లో ఇలా మొదటిసారి గెలిచిన గ్రోవర్ క్లీవ్‌లాండ్
డొనాల్డ్ ట్రంప్ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?
ఒక్క నెలలోనే రెట్టింపు అయిన ట్రంప్ సంపద
3.9 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ డాలర్లకు పెరుగుదల
ట్రంప్ మీడియా గ్రూప్ షేర్లు వృద్ధి చెందడంతో సంపద వృద్ధి
నెల వ్యవధిలో ఏకంగా నాలుగు రెట్లు పెరిగిన షేర్ల విలువ
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరోసారి అధ్యక్షుడుగా ఘన విజయం సాధించారు …తమ ప్రత్యర్థి డెమోక్రాటిక్ పార్టీకి చెందిన కమల హారిస్ పై స్పష్టమైన ఆధిక్యం లభించింది …హోరాహోరీగా సాగుతుందని అనుకున్న ఎన్నికలు ఏకపక్షంగా సాగినట్లుగా అయింది …మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా అధికారం దక్కాలంటే 270 ఓట్లు రావాలి…ట్రంప్ కు అంతకంటే ఎక్కువ 277 వచ్చాయి…కడపటి వార్తలు అందేసరికి మరో 37 ఎలక్టోరల్ ఓట్లు ప్రకటించాల్సి ఉంది …అయితే అందులో కూడా ట్రంప్ కే ఆధిక్యం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం…అంటే 300 కు పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది …ట్రంప్ స్వయంగా తనకు 315 వస్తాయని వెల్లడించారు …అమెరికా చరిత్రలో 131 ఏళ్ళ తర్వాత ట్రంప్ ఓడిపోయి తిరిగి పోటీచేసి గెలిచి అరుదైన రికార్డు సాధించారు …మొదటిసారిగా 1892 ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్‌లాండ్ ఇలా ఒడి తిరిగి పోటీచేసి గెలిచారు …
ట్రంప్ కు 7 కోట్ల 11 లక్షల ,13511 (51 శాతం ) ఓట్లు రాగ , కమల హారిస్ కు 6 కోట్ల 61 లక్షల 81515 (47 .5 శాతం ) వచ్చాయి ..గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ కు 6 లక్షల 13 వేల 96 ఓట్లు రాగ స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్ కెన్నడీకి 5 లక్షల 92 వేల 486 ఓట్లు వచ్చాయి…మిగతా వారికీ కనీస ఓట్లు లభించలేదు …
ఐ లవ్యూ అంటూ ఎలాన్ మస్క్ పై ప్రశంసల జల్లు
తన గెలుపు తర్వాత తొలిసారి ప్రసంగించిన ట్రంప్… ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా రాజకీయాల్లో సరికొత్త స్టార్ ఎలాన్ మస్క్ అని వ్యాఖ్యానించారు.
తన విజయంలో మస్క్ దే కీలకపాత్ర అని చెప్పారు. మస్క్ వంటి జీనియస్ లు అమెరికాకు అవసరమని… అలాంటి వారిని కాపాడుకుంటామని అన్నారు. ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలోని పలు ప్రాంతాల్లో రెండు వారాల పాటు మస్క్ ఎన్నికల ప్రచారం నిర్వహించారని చెప్పారు. మస్క్ నువ్వొక అద్భుతమైన వ్యక్తి… అందుకే ఐ లవ్యూ అని పేర్కొన్నారు.
అమెరికా ఎన్నికల చరిత్రలో.. ఓ అధ్యక్షుడు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోయి… ఆ తర్వాత శ్వేతసౌధాన్ని తిరిగి గెలుచుకోవడం ఇది రెండోసారి. 131 ఏళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ అరుదైన రికార్డ్‌ను సృష్టించాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచిన వారు ఉన్నారు. కానీ ఓసారి పదవిని చేపట్టాక… రెండోసారి ఓడిపోయి… మూడో ఎన్నికల్లో గెలవడం రెండోసారి.
2020లో జోబైడెన్ చేతిలో ఓడిపోయిన ట్రంప్ ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌పై ఘన విజయం సాధించారు. ట్రంప్ మొదటిసారి హిల్లరీ క్లింటన్‌పై గెలిచి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు.
డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు గ్రోవర్ క్లీవ్‌లాండ్ మాత్రమే ఇలా రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలుత 1884లో గెలిచిన ఆయన 1888లో ఓటమి చెందారు. ఆ తర్వాత 1892 ఎన్నికల్లో గెలుపొందారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ట్రంప్ ఆ రికార్డ్ సృష్టించారు.
డోనాల్డ్ ట్రంప్ సంపద …
గత నెల అక్టోబర్ ఆరంభంలో సుమారు 4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద విలువ ప్రస్తుతం రెట్టింపు అయింది. నెల వ్యవధిలోనే 8 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందింది. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.67 వేల కోట్లుగా ఉంది. ట్రంప్‌కు చెందిన మీడియా సంస్థ ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్’ షేర్లు భారీగా లాభపడడమే సంపద పెరుగుదలకు కలిసొచ్చింది. దీంతో సెప్టెంబర్ చివరిలో 3.9 బిలియన్ డాలర్లుగా ఉన్న ట్రంప్ ఆస్తి విలువ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఐదు వారాల క్రితం 12.15 డాలర్లుగా ఉన్న ట్రంప్ మీడియా షేర్ విలువ ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది. కంపెనీలో తనకు ఉన్న సుమారు 57 శాతం వాటాను విక్రయించబోనని ప్రకటించడంతో ట్రంప్ మీడియా షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో మే, మార్చి నెలల నాటి గరిష్ఠ స్థాయికి షేర్ల విలువ పెరిగింది. అయితే ట్రంప్ మీడియా షేర్లు కంపెనీ పనితీరు ఆధారంగా పెరగలేదని, ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో పెరిగాయని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.
ఇక డొనాల్డ్ ట్రంప్‌కు క్రిప్టోకరెన్సీలతో పాటు ఇతర డిజిటల్ అసెట్స్ రూపంలో ఆస్తులు ఉన్నాయి. అయితే ట్రంప్ టవర్‌తో పలు ఇతర ఆస్తులు తాకట్టులో ఉన్నాయని, చట్టపరమైన తీర్పులకు సంబంధించిన కొత్త అప్పులు కూడా ఉన్నాయని ఎన్నికల సందర్భంగా ట్రంప్ ప్రకటించారు.