Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సుప్రీం కోర్ట్ వార్తలు

ఎట్టిప‌రిస్థితుల్లో అలా చేయ‌కూడ‌దు.. ప్రభుత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!

  • రిక్రూట్‌మెంట్‌ మధ్యలో రూల్స్ మార్చకూడదన్న న్యాయ‌స్థానం
  • ఈ మేర‌కు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు అనుగుణంగా నిబంధ‌న‌లు ఉండాలని సూచ‌న‌

ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలకు సంబంధించి సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. రిక్రూట్‌మెంట్‌ మధ్యలో రూల్స్ మార్చకూడదని అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఉదయం కీలక తీర్పు వెల్ల‌డించింది. 

ఉద్యోగ నియామ‌క‌ ప్రక్రియ నిబంధనలు ఏకపక్షంగా ఉండకూడదని కోర్టు స్ప‌ష్టం చేసింది. రాజ్యాంగంలో పేర్కొన్న‌ ఆర్టికల్ 14కు అనుగుణంగా ఉండాలని తెలిపింది. వివక్షకు తావులేకుండా ఉండాలని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకత త‌ప్ప‌నిస‌రి అని సూచించింది. 

ఇక రిక్రూట్‌మెంట్‌ మధ్యలో  నిబంధనలను మారిస్తే అభ్యర్థులు గంద‌ర‌గోళానికి లోన‌వుతారని వివ‌రించింది. అందుకే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభానికి ముందు ఒకసారి నిర్ణయించిన రూల్స్‌ను ఎట్టిప‌రిస్థితుల్లో మధ్యలో మార్చకూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

Related posts

కోర్టు తీర్పులను విమర్శించే హక్కు మీడియాకుంది : సుప్రీంకోర్టు

Ram Narayana

సుప్రీంకోర్టులో కేసీఆర్ కు ఎదురుదెబ్బ…

Ram Narayana

జులై 20 మధ్యాహ్నం 12 గంటల్లోపు నీట్ ఫలితాలు విడుదల చేయండి.. సుప్రీం

Ram Narayana

Leave a Comment