Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

కులగణనపై రాహుల్ గాంధీ ట్వీట్… స్పందించిన రేవంత్ రెడ్డి

  • తెలంగాణలో కులగణన ప్రారంభమైందన్న రాహుల్ గాంధీ
  • కులగణనతో సరికొత్త విప్లవయాత్రకు శ్రీకారం చుట్టామన్న సీఎం
  • రాహుల్ వాగ్ధానం మేరకు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సాకారం కానుందని వ్యాఖ్య

తెలంగాణ కులగణన సర్వే చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

తెలంగాణలో కులగణన ప్రారంభమైందని… రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సంబంధించిన విధానాలను రూపొందించడానికి ఈ డేటాను వినియోగిస్తామని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోనూ ఇదే జరగనుందని… పార్లమెంట్‌లో ఈ కులగణను ఆమోదించి, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం అడ్డుగోడలను బద్ధలు కొడతామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ… రేవంత్ రెడ్డి స్పందించారు.

తెలంగాణలో ఈరోజు కులాల సర్వే గణన ప్రారంభంతో సరికొత్త విప్లవయాత్రకు శ్రీకారం చుట్టామని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సాకారం కానుందని పేర్కొన్నారు. కులగణన చేపట్టిన కార్యక్రమం చేపట్టిన ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు.

Related posts

జీవిత భాగస్వామి ఉండగా ‘సహజీవనం’ ముస్లిం సూత్రాలకు విరుద్ధం: అలహాబాద్ హైకోర్ట్ తీర్పు

Ram Narayana

మెరిట్స్ ఆధారంగా కాదు… రాహుల్ కు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై హరీశ్ సాల్వే కీలక వ్యాఖ్యలు

Ram Narayana

కేజ్రీవాల్‌కు షాక్… బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత!

Ram Narayana

Leave a Comment