Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విజయవాడ లయోలా కళాశాల వద్ద వాకర్స్ నిరసన ..

  • లయోలా కళాశాల మైదానంలో ఉదయపు నడకకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వాకర్స్ 
  • కళాశాల గేటు వద్ద కొద్ది సేపు ధర్నా చేసిన వాకర్స్
  • గేటు తాళాలు పగులగొట్టి మైదానంలోకి వెళ్లి వాకింగ్ చేసిన వాకర్స్ 

విజయవాడ లయోలా కళాశాల వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. కళాశాల మైదానంలోకి వాకర్స్‌ను అనుమంతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి నగరవాసులు లయోలా కాలేజీ వాకర్స్ పేరుతో కళాశాల మైదానంలో వాకింగ్ చేస్తున్నారు. దాదాపు మూడు వేల మంది సభ్యులతో వాకర్స్ అసోసియేషన్ ఉంది. 

అయితే కొవిడ్ సమయంలో వాకింగ్ ట్రాక్‌ను కళాశాల మూసివేసింది. వాకింగ్ ట్రాక్ తెరవాలంటూ అసోసియేషన్ ఒత్తిడి తీసుకువస్తూనే ఉంది. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. కేవలం ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ అధికారులకు మాత్రమే నడిచేందుకు కళాశాల యాజమాన్యం అనుమతి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాకింగ్ ట్రాక్ తెరిపిస్తామని నేతలు హామీ ఇచ్చారు. 

ఈ క్రమంలో వాకింగ్ ట్రాక్ తెరవాలంటూ లయోలా కళాశాల యాజమాన్యాన్ని వాకర్స్ ఎన్ని సార్లు కోరినా అనుమతి నిరాకరిస్తుండటంతో కళాశాల ముందు కొద్ది సేపు ధర్నా చేశారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కళాశాల యాజమాన్యం వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఉదయపు నడకకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గేట్లకు ఉన్న తాళాలు పగలకొట్టి లోపలికి వెళ్లి వాకింగ్ చేశారు. 

Related posts

ఖమ్మం షర్మిల సభ దృశ్యమాలిక

Drukpadam

పాదయాత్రలో రోహిత్ వేముల తల్లిని దగ్గరకు తీసుకున్న రాహుల్ గాంధీ..

Drukpadam

టీఆర్ యస్ కు ప్రతిష్టాత్మకం …బీజేపీకి సంకటం …కాంగ్రెస్ కు ఆక్సిజెన్!

Drukpadam

Leave a Comment