Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మీడియా సురక్షితంగా ఉన్నప్పుడే సమాజం సురక్షితంగా ఉంటుంది … ఉత్తరాఖండ్ మంత్రి

మీడియా సురక్షితంగా ఉన్నప్పుడే సమాజం సురక్షితంగా ఉంటుందని ఉత్తరాఖండ్ రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖమంత్రి సుభోద్ అనియాల్ అభిప్రాయపడ్డారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్ లో రెండు రోజులపాటు జరుగుతున్న ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మొదటిరోజు గురువారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గని ప్రసంగించారు.

ప్రజాస్వామ్యాన్ని పటిష్ట పరచడం సవాల్ గా మారిందని అభిప్రాయ పడ్డారు. వర్కింగ్ జర్నలిస్ట్ ల రక్షణ చట్టంపై తాను పెద్దలతో మాట్లాడతానని హమీ ఇచ్చారు. జర్నలిస్ట్ లు సమాజానికి దశ దిశ ఇచ్చేవాళ్ళు అని నిష్పాక్షపాతంగా వార్తలు ఇస్తే సమాజానికి మంచిదని అన్నారు.

పెన్షన్, సంక్షేమ పథకాలు అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఫారెస్ట్ గెస్ట్ హజ్ లను ప్రాధాన్యతక్రమంలో కేటాయిస్తామని ప్రకటించారు.

ఉత్తరాఖండ్ అంటే దేవతల భూమి ..72 శాతం అడవులతో నిండి ఉంది…హిమాలయాలకు గేట్ వే …అభివృద్ది చెందున్న రాష్ట్రం…ప్రశాంతతకు నిలయంగా ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఆర్మీలో చేరిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు. దేశరక్షణలో వారి బాగస్వామ్యం ఉన్నందుకు గర్వపడుతున్నామని అన్నారు. ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. మానవ విలువలు తగ్గుతున్నాయి .రాజకీయాలు కూడ అంతే ఉన్నాయి. జర్నలిస్టులు అందుకు మినహాయింపుకాదని మంత్రి అభిప్రాయపడ్డారు.

మంత్రిని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మంత్రి ప్రతినిధుల అందరివద్దకు స్యయంగా వెళ్ళి పరిచయం చేసుకున్నారు. సమావేశానికి కె. శ్రీనివాస్ రెడ్డి అద్యక్షత వహించారు. జమ్మూ, సిన్హా, అమర్ , జాతీయ కార్యదర్శి జయ్ సింగ్ రావత్ , ఉత్తరాఖండ్ అద్యక్షకార్యదర్శులు శంకర్ ప్రవీణ్ మోహత,గిరీష్ పంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బంగారు బాతుగుడ్డు లాంటి ఆంధ్రభూమిని చంపుతారా? ఐజేయు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి

Drukpadam

కమ్యూనిస్టులపై మంత్రి హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు …కూనంనేని ఆగ్రహం

Ram Narayana

ఈ దుబాయ్ గృహిణి రోజువారీ ఖర్చు రూ.70 లక్షలు!

Drukpadam

Leave a Comment