Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల వల్ల బీజేపీకి ప్లస్ అవుతుందా ?

ఈటల వల్ల బీజేపీకి ప్లస్ అవుతుందా ?
-కమలం పార్టీ గులాబీ తో ఢీకొంటుందా ?
-రాష్ట్రంలో బీజేపీ కు అంత శక్తి ఉందా?
-దేశంలో మోడీ ప్రభ తగ్గుతున్న సమయంలో రాష్ట్రంలో బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉందా ?

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాజీమంత్రి తాజాగా బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈటల తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచి కేసీఆర్ తోపాటు పాల్గొన్ననేత …ఆయనపై భూకబ్జా ఆరోపణలతో కేసీఆర్ ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు. దానితో ఆయన కేసీఆర్ తనపై తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోయారు. టీఆర్ యస్ నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ ను దెబ్బతీయాలన్న కసితో ఉన్న ఈటల తనకు వెంటనే బీజేపీ లో చేరితే తప్ప తాను అనుకున్న లక్ష్యం నెరవేరదని భావించారు.

రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు రాజకీయంగా క్రాస్ రోడ్ లో ఉన్న ఈటల కు వల వేశారు. ఆ వలలో ఆయన చిక్కుకున్నారు . ఇక్కడ నేతలు బీజేపీలో చేరితే కలిగే లాభాలను వివరించారు . దానికి అంగీకరించిన ఈటల ఢిల్లీ వెల్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర పెద్దలను కలిశారు. అక్కడ వారినుంచి ఏమి హామీ లభించిందో ఇంకా స్పష్టత రాలేదు కానీ బీజేపీ లో చేరేందుకు అంగీకరించారు. తిరిగి హైద్రాబాద్ వచ్చి బీజేపీ లో చేరేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన తో పాటు బీజేపీ లో చేరేందుకు ఆశక్తి వున్నా వారిని లిస్ట్ చేశారు. ప్రత్యేక విమానం బుక్ చేసుకున్నారు. ఢిల్లీ వెళ్లారు.  కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. …

నడ్డా కాకుండా ధర్మేంద్ర ప్రధాన్ తో ఎందుకు కాషాయ కండువా కప్పించుకున్నారు ?

ఇది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న …. ఇంత హడావుడిగా ఢిల్లీ వెళ్లి ఏ అమిత్ షా ,లేదా నడ్డా సమక్షంలో బీజేపీ లో చేరతారని అనుకుంటే తీరా ధర్మేంద్ర ప్రధాన్ చేత కాషాయ కండువా కప్పించుకోవడం ఏమిటి ? ఇది ఈటల కు జరిగిన పరాభవంగా చాలామంది భావిస్తున్నారు. రాజకీయవర్గాలలో దీనిపై ఆశక్తి కార చర్చ జరుగుతుంది. కేంద్ర మంత్రి తో కండువాలు కప్పించుకునేందుకు అక్కడ దాక పోవడం ఎందుకు అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ యస్ కు చెందిని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇది ఈటల కు జరిగిన అవమానం అని అన్నారు. నిత్యం ఆత్మాభిమానం గురించి మాట్లాడే ఈటల ఆత్మాభినం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు.

ఇక ఈటల చేరిక బీజేపీ కి ప్లస్ అవుతుందా అంటే కచ్చితంగా ప్లస్ అవుతుందనే మాటలే వినిపిస్తున్నాయి. బీజేపీ కి రాష్ట్రంలో పెద్దగా బలం లేదు … రాష్ట్రంలో బలం లేని పార్టీలో చేరటం ఆపార్టీకి బలమే కదా ? అందువల్ల ఈటల చేరిక బీజేపీకి ప్లస్ అవుతుందనడంలో సందేహం అవసరంలేదు. పైగా కేంద్ర ప్రభుత్వానికి   ప్రజల్లో ఆదరణ తగ్గుతూ వస్తుంది. అందువల్ల వారు ఎన్ని చెప్పిన 2023 లో బీజేపీ అధికారంలోకి రావాలంటే రాజకీయంగా భారీ మార్పులు జరగాలి . అది సాధ్యమా అంటే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి … రాష్ట్రాన్ని జిల్లాలను శాసించగలిగే వారు డజన్ల కొద్దీ బీజేపీ ని బలపరచాలి . బీజేపీ లో చేరాలి …. బీజేపీ కేంద్రంలో రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందనే అభిప్రాయాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. దీనికి తోడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో పూర్తీ నిర్లక్ష్యం వహించిందని , వ్యాక్సిన్ అందించడంలో ముందుచూపుతు వ్యవహరించలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.అందువల్ల బీసీ నేతగా ఉన్న ఈటల చేరిక కొంత బీజేపీకి కలిసొచ్చే అంశమే అయినా ఆయనకు బీజేపీ వల్ల ఎంతవరకు ఉపయోగం జరుగుతుందనేది ,రాజకీయ వర్గాలలో ఆశక్తిగా మారింది …..

బీజేపీ కేసీఆర్ మధ్య రహస్య అవగాహన ఉందా ?

దీనిపై కూడా రాజకీయ పండితులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బీజేపీకి కేంద్రంలో అధికారం కావాలి . అందుకు తెలంగాణాలో ఏ పార్టీ అధికారంలో ఉన్న కేంద్రానికి అవసరమైన మద్దతు ఇచ్చేది అయితే ఇబ్బంది ఉండదు . టీఆర్ యస్ కేంద్రానికి స్నేహపూర్వహాక సంబంధాలే ఉన్నాయి. అప్పుడు ఈటల రాజేందర్ లాంటి బీజేపీ ని నమ్ముకొని చేరిన వారి పరిస్థితి ఏమిటి ? రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ యస్ అవినీతిలో కూరుకు పోయిందని ఆరోపిస్తున్న బీజేపీ కేసీఆర్ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు . కేసీఆర్ కూడా అవసరమైన సందర్భాలలో కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రధానిని కలవక ముందు ఒకమాట కలిసిన తరువాత మరో మాట మాట్లాడిన తీరు బీజేపీతో కేసీఆర్ కు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుందని అభిప్రాయాలు ఉన్నాయి.

Related posts

గాంధీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా?: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్!

Drukpadam

పార్టీ 17 వార్షికోత్సవాలను పెద్ద ఎత్తున జయప్రదం చేయండి. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్!

Drukpadam

బీజేపీతో పొత్తుకోసమేనా..? చంద్రబాబు ఖమ్మం సభ….!

Drukpadam

Leave a Comment