అంతర్జాతీయంఆఫ్ బీట్ వార్తలు

పాకిస్థాన్‌లో సర్‌ప్రైజ్… కోటి రూపాయలు ఖర్చు చేసి 20 వేలమందికి బిచ్చగాడి డిన్నర్!

  • నానమ్మ జ్ఞాపకార్థం భారీ విందు ఏర్పాటు చేసిన బిచ్చగాడి కుటుంబం
  • 1.25 కోట్ల రూపాయలతో 20 వేల మందికి భోజనం పెట్టిన కుటుంబం
  • వేదిక వద్దకు అతిథులను తరలించేందుకు 2 వేల వాహనాలు ఏర్పాటు

పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాకు చెందిన ఓ బిచ్చగాడి కుటుంబం… తమ నానమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విందు కోసం అక్షరాలా 1.25 కోట్ల రూపాయలను (పాకిస్థాన్ కరెన్సీ) ఖర్చు చేసింది. ఈ విందులో 20 వేల మందికి పైగా భోజనం పెట్టింది. గుజ్రాన్‌వాలాలోని రాహ్‌వలి రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ఈ విందును ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బిచ్చగాడు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విందు ఏర్పాటు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పంజాబ్ ప్రావిన్స్‌లోని ఈ ప్రాంతంలో ఇటీవల బిచ్చగాడి నానమ్మ చనిపోయింది. 40వ రోజు ఆమె జ్ఞాపకార్థం భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు తమకు తెలిసిన వారందరినీ ఆహ్వానించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది వచ్చారు.

మరో ఆసక్తికర అంశం ఏమంటే అతిథులను వేదిక వద్దకు తరలించేందుకు దాదాపు 2 వేల వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ విందులో వారి సంప్రదాయ వంటకాలైన సిరి పాయా, మురబ్బాలతో పాటు మాంసాహారం ఉండేలా చూసుకున్నారు. మటన్, స్వీట్ రైస్ కూడా పెట్టారు. ఈ విందు కోసం 250 మేకలను వధించినట్లుగా కథనాలు వచ్చాయి. 

Related posts

బ్రిటన్‌లో పేట్రేగుతున్న జాత్యహంకారం.. సిక్కు యువతిపై ఘోరం…

Ram Narayana

శాన్‌ఫ్రాన్సిస్కో నగరాన్ని అట్టుడికించిన ‘పిల్లి చావు’!

Ram Narayana

సిన్వర్ స్థానంలో హమాస్ కు కొత్త చీఫ్ … నెక్ట్స్ టార్గెట్ నువ్వేనంటూ ఇజ్రాయెల్ వార్నింగ్

Ram Narayana