Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మంలో కోలాహలంగా జర్నలిస్ట్ హోసింగ్ సొసైటీ సభ్యత్వం…

ఘనంగా హౌసింగ్ సొసైటీ సభ్యత్వ నమోదు
— సీనియారిటీ ప్రాధాన్యతతో జర్నలిస్టులకు సభ్యత్వాలు
— జర్నలిస్టులు ఐక్యమత్యంతో ఇండ్ల స్థలాలు పొందాలి
— సభ్యత్వాలతో ఖమ్మం ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల కోలాహాలం

ఇళ్ల స్థలాల కోసం గత రెండు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం జర్నలిస్టులకు ‘స్తంభాద్రి జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్, ఖమ్మం తీపికబురు అందించింది. బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సీనియారిటీ ప్రాధాన్యతతో జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హౌసింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కనకం సైదులు, బొల్లం శ్రీనివాస్ లు మాట్లాడుతూ… ‘స్తంభాద్రి జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ – ఖమ్మం నియమ నిబంధనల మేరకు వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుత అక్రిడిటేషన్ తో పాటు గత సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. జర్నలిస్టులు ఐక్యమత్యంతో త్వరగా ఇళ్ల స్థలాలు పొందాలని జర్నలిస్ట్ యూనియన్లు అభిప్రాయబడ్డాయి. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రాంనారాయణ, టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పల్లా కొండలరావు, టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు లు మాట్లాడుతూ… జర్నలిస్టులు తమ హక్కుల కోసం ఐక్యమత్యంతో పోరాడితేనే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో హౌసింగ్ సొసైటీకి మా సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. జర్నలిస్టులు ఎవ్వరూ అపోహలకు పోవద్దని, హౌసింగ్ సొసైటీ నియమ నిబంధనలననుసరించి అర్హత కలిగిన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు న్యాయం జరుగుతుందని అన్నారు. సోషల్ మీడియా వేదికగా జరిగే దుష్ప్రచారాలను నమ్మొద్దని, జర్నలిస్టులు విజ్ఞతతో ఆలోచించి ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ సభ్యులు ఏనుగు వెంకటేశ్వరరావు, వెన్నబోయిన సాంబశివరావు, మైసా పాపారావు, బత్తుల వాసు, ఆలస్యం అప్పారావు, మాటేటి వేణుగోపాల్, నర్వనేని వెంకట్రావు, నలజాల వెంకట్రావు, చిర్రా రవి, సత్తుపాటి రామయ్య, సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related posts

కొత్తగూడెంలో వనమా గెలుపు కోసం ఎంపీ వద్దిరాజు బుల్లెట్ పై హల్చల్

Ram Narayana

సీటీ స్కాన్, టిఫా సేవలు వెంటనే పునరుద్దరణ చేయాలి – CPM

Ram Narayana

కాంగ్రెస్ గూటికి వైరా జెడ్పీటీసీ, ఎంపీపీ

Ram Narayana

Leave a Comment