Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సాక్షి మీడియాకు లీగల్ నోటీసు పంపిన రఘురామకృష్ణరాజు

సాక్షి మీడియాకు లీగల్ నోటీసు పంపిన రఘురామకృష్ణరాజు
-తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కథనాలను ప్రచురించారంటూ నోటీసు
-15 రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్న రాజు
-లేకపోతే రూ. 50 కోట్ల పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక

సాక్షి మీడియాకు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కథనాలను ప్రచురించారంటూ నోటీసులో పేర్కొన్నారు. తన నోటీసుకు 15 రోజుల్లో సమాధానం చెప్పాలని… లేకపోతే రూ. 50 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా కథనాలను ప్రసారం చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో క్రిమినల్ చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ వైయస్ భారతి, కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావులతో పాటు పాలకవర్గం డైరెక్టర్ల పేరుతో నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులపై సాక్షి యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మీడియా స్వచ్ఛపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో ఎంపీ రఘురామ సాక్షి మీడియాకు నోటుసులు పంపించడం ఆశక్తిగా మారింది. ఇటీవలకాలంలో కొన్ని మీడియా సంస్థలు తమకు నచ్చిన విధంగా వార్తలను వండి వార్చుతున్నాయని విమర్శలు ఉన్నాయి. మీడియా ఫోర్త్ పిల్లర్ గా ఉండి, రాజ్యాంగ పరిరక్షణకు తన మంత్రు పాత్ర పోషిస్తుంది .అయితే దానికి లక్ష్మణ రేఖ ఉండాలని తనను తాను నియత్రించుకుంటేనే మీడియాపై ప్రజల్లో నమ్మకం ,విశ్వాసం మరింత పెరుగుతుందనే చర్చలు జరుగుతున్న సందర్భంలో వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణమరాజు సాక్షి కి లీగల్ నోటీసులు పంపించడం పై ఆశక్తి నెలకొన్నది ….

Related posts

కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కు స్పందన…వరద భాదితులకు అండగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర!

Drukpadam

గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించకపోవడంపై స్పందించిన ఈసీ!

Drukpadam

60 సంవత్సరాలు పైబడ్డ ఎంపీలకు కరోనా వ్యాక్సిన్…

Drukpadam

Leave a Comment