Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

ఆ హీరో కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానన్న ఖుష్బూ !

ఇక్కడే నీ చెంప పగలగొట్టనా?.. లేక సెట్‌లో అందరిముందు కొట్టనా అన్న ఖుష్బూ

  • ఇఫ్పీ వేడుకల్లో ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు
  • ఆ హీరో ఎవరై ఉంటారంటూ అప్పుడే ఊహాగానాలు
  • నచ్చనిది జరుగుతున్నప్పుడు నో చెప్పడం తెలియాలని సూచన
  • ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపు

గోవా రాజధాని పనాజీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫ్పీ)లో పాల్గొన్న ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. అప్పట్లో ఓ హీరో తనతో ఇబ్బందికరంగా మాట్లాడాడని, ‘నాకు ఏమైనా చాన్స్ ఉందా?’ అని అడగడంతో నివ్వెరపోయానని పేర్కొన్నారు. 

తాను వెంటనే తేరుకుని ‘నా చెప్పుల సైజు 41. ఇక్కడే చెంప పగలగొట్టనా? లేదంటే సెట్లో అందరి ముందు పగలగొట్టనా?’ అని అడిగానని చెప్పుకొచ్చారు. సమానత్వం, గౌరవం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనేది తన సిద్ధాంతమని చెప్పారు. అలాగే పనిచేస్తూ వచ్చానని వివరించారు. ఖుష్బూ చేసిన ఈ వ్యాఖ్యలపై అప్పుడే చర్చ మొదలైంది. ఆ హీరో ఎవరై ఉంటారంటూ అప్పుడే ఎవరికి తోచినట్టుగా వారు ఓ అంచనాకు వచ్చేస్తున్నారు.

కేరళ చిత్ర పరిశ్రమలో మహిళా నటులకు వేధింపులపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ హేమ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరిశ్రమలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మహిళా నటులు కమిటీ ముందు ఏకరవు పెట్టారు. చర్చనీయాంశమైన ఈ విషమైన ఇప్పీలో జరిగిన చర్చలో ఖుష్బూ, సుహాసినీ, ఇంతియాజ్ అలీ తదితరులు కీలక విషయాలు పంచుకున్నారు. తమకు నచ్చనిది జరుగుతున్నప్పుడు నో చెప్పడం తెలియాలని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.

Related posts

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Ram Narayana

‘మా’ ఎన్నికలతో సీఎం జగన్ కు సంబంధంలేదు: మంత్రి పేర్ని నాని

Drukpadam

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు రూ.80 కోట్లు ఖర్చు: తమ్మారెడ్డి

Drukpadam

Leave a Comment