Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

‘నేవా’లోకి ఏపీ శాసన వ్యవస్థ..!

  • కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం
  • కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ శాసనసభ సభాపతి, ఉప సభావతి, కౌన్సిల్ చైర్మన్‌లు
  • అప్లికేషన్ అమలు ప్రారంభమైతే సభా కార్యకలాపాలు అన్నీ ఇక డిజిటల్‌గానే..

కాగిత రహిత విధానంలో అసెంబ్లీ కార్యకలాపాలను డిజిటల్ రూపంలో నిర్వహించేందుకు వీలుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ (నేవా)లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి చేరాయి. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఉమంగ్‌నరులా సమక్షంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సత్యప్రకాశ్‌లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. 

పార్లమెంట్‌తో పాటు దేశంలోని 31 శాసనసభలు, 6 శాసనమండళ్లను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నేవాను ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులకు కూడా ట్యాబ్‌లు అందిస్తారు. అప్లికేషన్ అమలు ప్రారంభమైతే సభా కార్యకలాపాలు అన్నీ డిజిటల్‌గా నిర్వహించడానికి వీలవుతుంది. ఈ యాప్‌లో ప్రతి సభ్యుడికీ ప్రత్యేక డ్యాష్ బోర్డు ఉంటుంది. అందులో సభలో తన కార్యకలాపాలను చూసుకునే వీలు ఉంటుంది. 

Related posts

మార్చ్, ఏప్రిల్ మాసాల్లో ప్రాంతీయ సదస్సులు-టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ

Drukpadam

మున్నేరు వరద భాదితులను పరామర్శించిన అంతరం మీడియాతో భట్టి

Ram Narayana

ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి అనేదానిపై ప్రభుత్వాలకు ఏంపని …హిజాబ్ పై కేసీఆర్!

Drukpadam

Leave a Comment