Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రికెట్ వార్తలు

వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో టీమిండియా మళ్లీ టాప్!

  • ఆస్ట్రిలియాను 295 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆధిక్యంలోకి దుసుకెళ్లిన టీమిండియా
  • ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో 61.11 శాతంతో తొలి స్థానానికి చేరిన భారత్  
  • 57.69 శాతంతో రెండో స్థానంలోకి వెళ్లిన ఆసీస్

పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా .. ఐదు టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. అంతే కాక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లలోనూ (డబ్ల్యుటీసీ 2023-25) మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ ముందు వరకూ మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కిందికి పడిపోయింది. వచ్చే సంవత్సరం జూన్‌లో జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ లో భారత్ తలపడాలంటే ఈ సిరీస్‌ను కనీసం 4-0 తేడాతో దక్కించుకోవాల్సి ఉంది. 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో ప్రస్తుతం భారత్ 61.11 శాతం సాధించింది. ఇప్పటి వరకు 15 టెస్టులు ఆడిన టీమిండియా తొమ్మిది మ్యాచుల్లో నెగ్గింది. ఐదింట్లో ఓటమి పాలయింది. ఒకటి డ్రాగా ముగిసింది. మొత్తం 98 పాయింట్లు భారత్ ఖాతాలో ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఉన్న ఆసీస్ 57.69 శాతంతో కొనసాగుతోంది. మొత్తం 13 మ్యాచుల్లో 8 గెలుపొందగా, నాలుగు ఓటములను చవి చూసింది. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ 62.50 శాతం, భారత్ 58.33 శాతంతో తొలి రెండు స్థానాల్లో ఉండేవి. ఇప్పుడు తాజా విజయంతో తారుమారు కావడం గమనార్హం.  పట్టికలో శ్రీలంక 55.56 శాతం, న్యూజిలాండ్ 54.55, దక్షిణాఫ్రికా 54.17 శాతంతో టాప్ – 5లో ఉన్నాయి. 

Related posts

ఐపీఎల్ మెగా వేలం.. రిషభ్‌పంత్ కనీస ధర ఎంతో తెలుసా?

Ram Narayana

వర్షంతో మ్యాచ్ రద్దు… ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన సన్ రైజర్స్…

Ram Narayana

పెర్త్ టెస్టులో భార‌త్ ఘ‌న విజ‌యం!

Ram Narayana

Leave a Comment