- ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ విజయం
- రెండు రోజుల క్రితం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ
- రాహుల్ గాంధీతో కలిసి వయనాడ్‌లో బహిరంగ సభకు హాజరు
ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఎంపీ హోదాలో తొలిసారి వయనాడ్‌లో అడుగు పెట్టారు. ఇటీవల జరిగిన వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఆమె భారీ మెజార్టీతో విజయం సాధించారు. రెండు రోజుల క్రితం ఎంపీగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో తనను గెలిపించిన నియోజకవర్గానికి ఎంపీ హోదాలో వెళ్లారు.
తన సోదరుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి శనివారం ఉదయం ఆమె కేరళ చేరుకున్నారు. వయనాడ్‌లోని ముక్కంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆమె రెండు రోజుల పాటు వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సమీప సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై ప్రియాంక గాంధీ 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌కు దాదాపు లక్షా పదివేల ఓట్లు పడ్డాయి. సీపీఐ అభ్యర్థికి 2 లక్షల 83 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి.