తెలుగు రాష్ట్రాలు

ఫెంగల్ తుపాను ఎఫెక్ట్… తెలుగు రాష్ట్రాల నుంచి పలు విమాన సర్వీసులు రద్దు!

  • బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను
  • చెన్నైలో వరదలు… విమానాశ్రయం మూసివేత
  • విమానాల రాకపోకలకు ప్రతికూల వాతావరణం
  • ఏపీ, తెలంగాణ నుంచి పలు విమాన సర్వీసుల నిలిపివేత

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను కారణంగా చెన్నై, తిరుపతి నగరాల్లో విమానాల రాకపోకలకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దు చేశారు. అదే సమయంలో, తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏడు విమానాలు కూడా రద్దయ్యాయి. 

అటు, చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలు రద్దయ్యాయి. ముంబయి, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమాన సర్వీసులు కూడా ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయాయి. 

ఫెంగల్ తుపాను కారణంగా చెన్నైలో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దాంతో విమానాశ్రయాన్ని మూసివేశారు.

Related posts

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో పోరాడుతున్న తెలుగు విద్యార్థిని దీప్తి!

Ram Narayana

తెలుగు రాష్ట్రాల మధ్య తొలి గ్రీన్‌ఫీల్డ్ హైవే.. మేలో ప్రారంభం!

Ram Narayana

ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలో సినీ పాత్రికేయులకు విశిష్ట సత్కారం..

Ram Narayana