Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయం: కోల్‌కతాలోని ఆసుపత్రి ప్రకటన!

  • బంగ్లాలో హిందువులపై దాడులు, భారతీయ జెండాకు అవమానం
  • అందుకే బంగ్లా రోగులకు చికిత్స చేయమన్న జేఎన్ రే ఆసుపత్రి
  • నిరవధికంగా… చికిత్స చేయబోమని నోటిఫికేషన్

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, దేవాలయాలపై దాడులు, భారతీయ జెండాకు అవమానం నేపథ్యంలో ఆ దేశానికి చెందిన రోగులకు చికిత్స చేసేది లేదని కోల్‌కతాలోని జేఎన్ రే ఆసుపత్రి ప్రకటించింది. బంగ్లాదేశీయులు భారతీయ జెండాను అవమానించారని, అక్కడి హిందువుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

మానిక్‌తలా ప్రాంతంలోని జేఎన్ రే ఆసుపత్రి అధికారి సుభ్రాంశు భక్త్ నిన్న ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ రోజు నుంచి నిరవధికంగా… బంగ్లాదేశ్ రోగులను చికిత్స కోసం చేర్చుకోబోమని నోటిఫికేషన్ జారీ చేశామని, భారత్ పట్ల బంగ్లాదేశీయులు చూపిన తీరు పట్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

బంగ్లాదేశ్ స్వాతంత్రంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించిందని ఈ సందర్భంగా సుభ్రాంశు గుర్తు చేశారు. అయినప్పటికీ భారత వ్యతిరేక భావాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశీయులు త్రివర్ణ పతాకాన్ని కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

అస్వస్థతకు గురైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం!

Ram Narayana

రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర క్యాబినెట్ సిఫార్స్

Ram Narayana

బిహార్‌లో 27 మందిని బ‌లిగొన్న‌ క‌ల్తీ మ‌ద్యం…

Ram Narayana

Leave a Comment