Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

లక్కీ డ్రాలో రూ.1.5 కోట్లు గెలుచుకున్న హర్యానా ప్లంబర్!

  • కొన్నేళ్లుగా లాటరీ టిక్కెట్ కొనుగోలు చేస్తున్న ప్లంబర్ మంగళ్
  • రాత్రి 9 గంటలకు ఫోన్ చేసి లాటరీ గెలిచినట్లు తెలిపిన ఏజెంట్
  • ఈ మొత్తంతో ఇల్లు కడతానని, కూతురు కోసం పొదుపు చేస్తానన్న మంగళ్

హర్యానాలోని సిర్సా జిల్లా ఖైర్‍‌‌పూర్ గ్రామానికి చెందిన ప్లంబర్‌కు లాటరీ లక్కీ డ్రాలో రూ.1.5 కోట్ల బహుమతి తగిలింది. ఇది అతనితో పాటు అతని కుటుంబానికి ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. లక్కీ డ్రాలో అంత పెద్ద మొత్తం రావడంతో ఒక్కసారిగా అతని దశ తిరిగింది!

ఖైర్‌పూర్‌కు చెందిన 40 ఏళ్ల ప్లంబర్ మంగళ్‌కు రెండు రోజుల క్రితం రాత్రి 9 గంటలకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అతనికి ఫోన్ చేసింది లాటరీ ఏజెంట్. అతను ఐదేళ్లుగా లాటరీని కొనుగోలు చేస్తున్నాడు. కానీ ఈసారి అదృష్టం వరించింది. లాటరీలో రూ.1.5 కోట్లు గెలుచుకున్నట్లు సదరు ఏజెంట్ చెప్పాడు. అయితే అతను చెప్పిన దానిని తొలుత మంగళ్ నమ్మలేకపోయాడు. ఆ తర్వాత నిజమేనని తెలిసి ఎంతో ఆనందించాడు. ఆ రాత్రి అతని కుటుంబ సభ్యులు నిద్ర కూడా పోలేనంత సంతోషంలో మునిగితేలారు.

ఆ తర్వాత ఈ సంతోషాన్ని ఇరుగుపొరుగుకు చెప్పి… మిఠాయిలు పంచారు. లాటరీలో వచ్చిన డబ్బుతో కొంత మొత్తంతో ఇల్లు కడతానని, మిగతా మొత్తాన్ని తన కూతురు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానని తెలిపాడు.

Related posts

బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్కాం?.. ఖాతాదారుల్లో టెన్షన్

Ram Narayana

నేను వ్యాపారానికి వ్యతిరేకం కాదు… కానీ…!: రాహుల్ గాంధీ!

Ram Narayana

కిటకిటలాడుతున్న శబరిమల

Ram Narayana

Leave a Comment