రేవంత్ రెడ్డి ఇది.. నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దం హరీష్ రావు ఫైర్
అక్రమ నిర్బంధాలు అరెస్టులు తమను అడ్డుకోలేవు …
బీఆర్ యస్ నాయకులు కార్యకర్తలపై నిర్బంధాలు
ప్రజాపాలన అంటూ అప్రజాస్వామిక విధానాలు
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ
అక్రమ నిర్బంధాలు, అరెస్టుల పట్ల మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి పోస్టు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు.
”ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దం. ఒకవైపు ప్రజా పాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించావు. మీ అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైఖరిని చూసి హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నాడు. అదుపులోకి తీసుకున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం” అంటూ హరీష్ రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: