Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మొదటిసారి ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్ …

మొదటిసారి ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం స్టాలిన్
-తమిళనాడు అంశాలపై చర్చ
-నీట్, నూతన విద్యావిధానం రద్దు చేయాలని
-ఢిల్లీలో స్టాలిన్ పర్యటన
-వ్యవసాయ చట్టలపైనా చర్చ
-సహకారానికి ప్రధాని హామీ ఇచ్చారన్న స్టాలిన్

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మొదటిసారిగా సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానితో సమావేశం సంతృప్తికరంగా సాగిందని అనంతరం స్టాలిన్ మీడియా కు వెల్లడించారు.ఎన్నికల్లో హోరారిగా బీజేపీకి కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టాలిన్ ప్రచారం నిర్వహించారు . నరేంద్ర మోడీని కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

తమిళనాడు అభివృద్ధికి సహాయపడతామని , కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తనను ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని మోదీ చెప్పారని స్టాలిన్ వివరించారు. మోడీని నుండి సానుకూలత వ్యక్తం కావడంతో స్టాలిన్ సంతృప్తి వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, జాతీయస్థాయి వైద్య ప్రవేశాల అర్హత పరీక్ష నీట్, నూతన విద్యావిధానాలను ఎత్తివేయాలని ప్రధానిని కోరినట్టు వెల్లడించారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ అంశాన్ని కూడా ప్రధాని వద్ద ప్రస్తావించినట్టు తెలిపారు.

Related posts

How to Travel Europe by Bus for Under $600

Drukpadam

తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు…మంత్రి పువ్వాడ అజయ్

Drukpadam

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ జయభేరి… బీజేపీ 15 ఏళ్ల పాలనకు ముగింపు!

Drukpadam

Leave a Comment