Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

హైద్రాబాద్ లో అంబులెన్స్ చోరీ …

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. కారు, బైక్‎ ఎత్తుకెళ్తే కిక్కే లేదనుకున్నాడో.. మరీ ఇంకేమనుకున్నాడో కానీ ఏకంగా అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‎నే చోరీ చేశాడు ఓ విచిత్ర దొంగ..!!

పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి చివరకు దొరికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ శివారు హైయత్ నగర్‎లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు ఉన్న అంబులెన్స్‎పై కన్నేశాడో దొంగ. ఇంకేముంది.. ఎవరూ చూడని సమయంలో అంబులెన్స్ తీసుకుని పరార్ అయ్యాడు.
అంబులెన్స్ సైరన్ మోగిస్తూ అతి వేగంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై అంబులెన్స్‎ను పరుగులు పెట్టించాడు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దొంగను వెంబడించారు. ఈ క్రమంలోనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చిట్యాల పోలీసులు దొంగను పట్టుకునేందుకు హైవే పై అడ్డంగా నిలబడ్డారు. పోలీసులను చూసి కూడా ఏ మాత్రం జంకని దొంగ.. ఏకంగా పోలీసును ఢీకొట్టి వెళ్లాడు. ఈ ఘటనలో జాన్ రెడ్డి అనే పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. చిట్యాల పోలీసుల నుండి తప్పించుకున్న దొంగ కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద టోల్ గేటును ఢీకొట్టి అలాగే ముందుకు పోయాడు. విషయం తెలుసుకున్న టేకుమట్ల పోలీసులు దొంగను పట్టుకునేందుకు పకడ్బందీ ప్లాన్ వేశారు. హైవేపై ఏకంగా కనీసం బైక్ కూడా పట్టే అంత గ్యాప్ వదలకుండా లారీలను అడ్డుపెట్టారు.
ఇక, గత్యంతరం లేని పరిస్థితిలో దొంగ అంబులెన్స్‎ను ఆపేశాడు. వెంటనే పోలీసులు టేకుమట్ల వద్ద దొంగను అదుపులోకి తీసుకుని అంబులెన్స్‎ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను ముప్పు తిప్పలను పెట్టిన ఈ దొంగకు మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. దొంగను పట్టుకోవడం కోసం విజయవాడ హైవే పై జరిగిన ఈ ఛేజింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. సినిమాల్లో చూపించే మాదిరిగా విజయవాడ హైవేపై ఛేజింగ్ జరిగిందంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

ఆస్ట్రేలియా అమ్మాయిని భారతీయ వ్యక్తి ఎందుకు హత్య చేశాడంటే…!

Drukpadam

లఖింపూర్ ఖేరి ఘటన పక్కా ప్రణాళికతో జరిగింది: కోర్టుకు వెల్లడించిన సిట్

Drukpadam

రాజు చనిపోయినా ప్రజల ఆగ్రహం చల్లారలేదు…హోమ్ మంత్రిని సైతం అడ్డుకున్న వైనం!

Drukpadam

Leave a Comment