చెరకు టన్ను కు రూ 1000 బోనస్ అందించాలి
యాంత్రీకరణ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ అందించాలి
కేంద్ర ప్రభుత్వం చెరకు ధర నిర్ణయం పాత షుగర్ రికవరీ విధానం ఆధారంగా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి చెరకు రైతు సంఘం వినతి
రాష్ట్ర ప్రభుత్వం చెరకు టన్నుకు బోనస్ రూ.1000 అందించాలని శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ చెరకు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు.. తెలంగాణ రాష్ట్రంలో చెరకు సాగు రైతులకు గిట్టుబాటు కాకపోవడంతో 2014లో 1.5 లక్షల ఎకరాల విస్తీర్ణం నుంచి 30 వేల ఎకరాల విస్తీర్ణం కి తగ్గిపోయిందన్నారు, 2014 లో 11 షుగర్ ఫ్యాక్టరీలు రన్నింగ్ లో ఉంటే నేడు 7 షుగర్ ఫ్యాక్టరీలు రన్నింగ్ లో ఉండి నెల రోజులు కూడా క్రషింగ్ చేసే పరిస్థితి లేదు అన్నారు, 2023-24 క్రషింగ్ సీజన్లో తెలంగాణ రాష్ట్రం లో 17,24,190 టన్నుల చెరకు 7 ఫ్యాక్టరీల్లో క్రషింగ్ అయిందని టన్ను కు రూ1000 బోనస్ ప్రకటించి రైతులకు అందించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు లోపు ఇస్తే సరిపోతుంది అన్ని. తెలంగాణ లో చెరకు సాగు ద్వారా చెరకు ఉప ఉత్పత్తులు వలన రాష్ట్ర ప్రభుత్వం కు 1,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని వివరించారు. అందులో 20 శాతం చెరకు రైతులకు ప్రోత్సాహం కింద తిరిగి బోనస్ రూప లో చెల్లించాలని అన్నారు. చెరకు సాగుకు అవసరమైన యాంత్రీకరణ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ అందించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం చెరకు ధరకు షుగర్ రికవరీ 8.5 నుంచి 10.25 పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాల చెరకు రైతులకు తీరని ఆర్థిక నష్టం వాటిల్లిందని అన్నారు. 8.5 రికవరీ పద్దతిలో ధర నిర్ణయం చేయాలని అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చోరవ చేసి దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు సహకారంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత చెరకు పరిశ్రమలు మూతపడ్డకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు . మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ చెరకు పంట సాగు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ శాఖ పరిధిలో ఉందని త్వరలోనే రాష్ట్రం ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాతా భాస్కరరావు, చెరకు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రచ్చా నరసింహారావు, యనమద్ది లెనిన్, పొన్నగాని భాస్కర్ మాడపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.