Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

28న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్న వైష్ణవ్, కిషన్ రెడ్డి…

  • టెర్మినల్‌లో ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిఫ్ట్‌లు, ఆరు బుకింగ్ కౌంటర్లు
  • మహిళలకు, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్స్
  • ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం

రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఈ నెల 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిసి ప్రారంభించనున్నారు. ఈ స్టేషన్‌లో ఆరు ఎస్కలేటర్లు, ఏడు లిఫ్ట్‌లు, ఆరు బుకింగ్ కౌంటర్లు, మహిళలకు, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్స్, హైక్లాస్ వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ నిర్మించారు.

ఈ టెర్మినల్ మొదటి అంతస్తులో కెఫ్-టేరియా, రెస్టారెంట్, రెస్ట్ రూం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం ఉంటుంది. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమయ్యాక భాగ్యనగరానికి చెందిన పలు రైళ్లు ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది.

Related posts

భట్టి పీపుల్స్ మార్చ్ ఖమ్మం నగరంలోకి గ్రాండ్ ఎంట్రీ …ప్రజల బ్రహ్మరథం…

Drukpadam

మోహన్ బాబును అరెస్ట్ తప్పదు : పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు

Ram Narayana

తెలంగాణాలో వర్షాలు మరో రెండు రోజులు …వాతావరణ శాఖ

Ram Narayana

Leave a Comment