Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసుల నోటీసులు…

  • రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు
  • సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నోటీసులు
  • ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న అల్లు అర్జున్

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె తనయుడు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని కూడా పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts

సంధ్య థియేటర్ కేసులో నిందితుల జాబితా ఇదే!

Ram Narayana

కొణిజేటి రోశయ్య నిఖార్సైన హైదరాబాదీ: రేవంత్ రెడ్డి

Ram Narayana

 ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద తనయుడి పెళ్లి కార్డు ఉంచిన షర్మిల… ఫొటోలు ఇవిగో!

Ram Narayana

Leave a Comment