Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

రెండు గంటల్లో శ్రీవారి దర్శనం… ఏఐ టెక్నాలజీని పరిశీలించిన టీటీడీ సభ్యులు…

  • భక్తులకు తక్కువ సమయంలోనే దర్శనం
  • చర్యలు తీసుకుంటున్న టీటీడీ
  • బీఆర్ నాయుడిని కలిసిన రెండు ఏఐ సంస్థల ప్రతినిధులు

తిరుమలకు వచ్చే భక్తులకు తక్కువ సమయంలోనే శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా టీటీడీ పాలకమండలి చర్యలు తీసుకుంటోంది. ఇటీవల టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడు ఈ అంశంలో చొరవ చూపిస్తున్నారు. బీఆర్ నాయుడు… రెండు ఏఐ టెక్నాలజీ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. Aaseya, Ctruh సంస్థలు సంయుక్తంగా అభివృద్ది చేసిన ఏఐ మోడల్ ను బీఆర్ నాయుడు, టీటీడీ సభ్యులు ఈ సందర్భంగా పరిశీలించారు. 

ఈ విధానంలో తొలుత… భక్తుడి ఫేస్ రికగ్నిషన్ రికార్డ్ అయ్యాక, ఓ కియోస్క్ నుంచి టోకెన్ (బార్ కోడ్ స్లిప్) వస్తుంది. అందులో భక్తుడి వివరాలు, దర్శనం సమయం ఉంటాయి. నిర్దేశిత సమయానికి భక్తుడు క్యూలైన్ ఎంట్రీ వద్దకు వెళితే ఫేషియల్ రికగ్నిషన్ ఆధారంగా ఆటోమేటిగ్గా గేటు తెరుచుకుంటుంది. ఈ విధానాన్ని ఆ రెండు సంస్థల ప్రతినిధులు టీటీడీ సభ్యుల ముందు డెమో ఇచ్చారు. 

తాజాగా ప్రజంటేషన్ ఇచ్చిన రెండు కంపెనీలు (Aaseya, Ctruh) 14 దేశాల్లో ఏఐ సంబంధిత సేవలు అందిస్తున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. శ్రీవారి దర్శనం అంశంలో ఏఐ టెక్నాలజీ అందిస్తామంటూ మరికొన్ని సంస్థలు కూడా ముందుకొస్తున్నాయని, వాళ్ల కాన్సెప్టులు కూడా పరిశీలించిన తర్వాత, మేలైన విధానాన్ని ఖరారు చేస్తామని తెలిపారు. 

Related posts

కడుపు మండి మాట్లాడుతున్నాను… జైల్లో ఉండాల్సింది చంద్రబాబులాంటి వారు కాదు: మోత్కుపల్లి

Ram Narayana

ఆదాయంలో బీఆర్ఎస్ టాప్, ఖర్చులో రెండో స్థానంలో వైసీపీ..

Ram Narayana

బాలకృష్ణ చర్చిస్తున్నారు: తెలంగాణలో టీడీపీ పోటీపై అచ్చెన్నాయుడు స్పందన

Ram Narayana

Leave a Comment