Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఫార్ములా ఈ-రేస్ కేసులో ఐఏఎస్ అధికారి దాన కిషోర్ వాంగ్మూలం నమోదు…

  • 7 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు
  • స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఏసీబీ
  • వివరాల ఆధారంగా కేటీఆర్, అర్వింద్ కుమార్‌లకు నోటీసులు!

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫార్ములా ఈ-రేస్ కేసులో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఫిర్యాదుదారుడైన ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 

దాన కిశోర్ నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు విచారణ చేపట్టనున్నారు. నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌లకు నోటీసులు ఇవ్వనున్నారు. ఫార్ములా ఈ-రేస్‌ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి దానకిషోర్ వివరాలు సమర్పించిన విషయం తెలిసిందే. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకే హెచ్‌ఎండీఏ నుంచి నిధులు బదిలీ అయినట్టు ప్రభుత్వానికి వెల్లడించారు.

కాగా, ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఉన్నారు.

Related posts

కుటుంబ డిజిట్ కార్డులో.. మ‌హిళే య‌జ‌మాని–ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

Ram Narayana

సీతారామ లిఫ్ట్ పంప్ హౌస్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Ram Narayana

తెలంగాణలో రంజాన్ లో 24 గంటలూ దుకాణాలు నడుపుకోవడానికి అనుమతి!

Ram Narayana

Leave a Comment